ఏ రోజు ఎలా ఉన్నా ఎదుర్కొని ముందుకెళ్లాల్సిందే.. మనలోని ధైర్యాన్ని నిరూపించుకోవాలి: సమంత (Samantha Ruth Prabhu)

Updated on Nov 08, 2022 10:01 AM IST
జీవితంలో అనునిత్యం ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకెళ్లాలని హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) అన్నారు
జీవితంలో అనునిత్యం ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకెళ్లాలని హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) అన్నారు

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) ‘మయోసైటిస్’ (Myositis) అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ డిసీజ్‌కు చికిత్స తీసుకుంటూనే ఆమె తాజా చిత్రం ‘యశోద’కు డబ్బింగ్ చెప్పారు. లేటెస్ట్‌గా తన ఫొటోలను సోషల్ మీడియాలో సమంత షేర్ చేశారు. జీవితం ఎలా ఉన్నా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మనం వాటిని ఎదుర్కొంటూ ముందుకెళ్లాలని ఆమె అన్నారు. మనలో ఉన్న ధైర్యం ఏమిటో నిరూపించుకోవాలని తన స్నేహితులు చెప్పారని.. ఆ మాటలే తనకు స్ఫూర్తి అని సామ్ చెప్పారు. 

ప్రమోషన్స్‌లో పాల్గొననున్న సామ్

‘యశోద’ (Yashoda) సినిమా ప్రమోషన్స్‌లో తాను పాల్గొంటానని సమంత తెలిపారు. నవంబర్ 11న ఈ మూవీ రిలీజ్ అవుతోందని ఆమె పేర్కొన్నారు. సామ్ పోస్టును చూసిన ఆమె అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమ అభిమాన నటి కోలుకోవడం, ప్రమోషన్స్‌లో పాల్గొంటానని చెప్పడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సవాళ్లకు వెరవని వ్యక్తిత్వం సమంతది అని పొగుడుతున్నారు. ‘మయోసైటిస్’ వ్యాధి రూపంలో కఠిన సవాల్ ఎదురైనా.. దాన్ని తట్టుకుని ‘యశోద’ చిత్రం ప్రమోషన్స్‌లో పాల్గొంటోందని ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వృత్తిపై ఆమె నిబద్ధత చూసి మెచ్చుకుంటున్నారు.

పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మనం వాటిని ఎదుర్కోవాలని సమంత (Samantha Ruth Prabhu) అన్నారు

ఇకపోతే, సమంత ఆరోగ్యంపై కొంతకాలంగా పలు రకాల రూమర్స్ తెరపైకి వచ్చాయి. సామ్ అనారోగ్యంగా ఉన్నారని.. ఆమె చికిత్స తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై తాజాగా సమంత స్పందించారు. తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని ఆమె వెల్లడించారు. ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న ఒక ఫొటోను ఆమె షేర్ చేశారు. కొన్ని నెలల నుంచి ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నానని సమంత తెలిపారు. ఈ విషయాన్ని పూర్తిగా కోలుకున్న తర్వాత అందరితో చెబుదామని అనుకున్నానని.. కానీ అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతోందన్నారు. 

ఇక, సమంత నటిస్తున్న కొత్త చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ మూవీని విడుదల చేయనున్నారు. సరోగసీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల విడుదలైన ‘యశోద’ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. 

Read more: EXCLUSIVE: "నటనలో సెంచరీలు ఉండాలే కానీ.. బౌండరీలు ఎందుకు ?" : రాజ్ తరుణ్ (Raj Tarun)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!