'ఖుషీ' చేసేందుకు రెడీ అవుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda).. ప‌వ‌న్ పుట్టిన రోజున షూటింగ్‌లో రౌడీ హీరో

Updated on Sep 03, 2022 12:55 PM IST
Kushi : ప‌వ‌న్ కల్యాణ్ పుట్టిన రోజున  విజ‌య్ దేవ‌ర‌కొండ‌  (Vijay Devarakonda)  'ఖుషీ' షూటింగ్‌ను ప్రారంభించారు.
Kushi : ప‌వ‌న్ కల్యాణ్ పుట్టిన రోజున విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Devarakonda) 'ఖుషీ' షూటింగ్‌ను ప్రారంభించారు.

Kushi :టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda) న‌టించిన పాన్ ఇండియా సినిమా 'లైగ‌ర్' భారీ ఫ్లాప్‌ను తెచ్చిపెట్టింది. దీంతో విజ‌య్ కొత్త సినిమాల‌పై ఫోక‌స్ పెట్టారు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న 'ఖుషీ' సినిమా షూటింగ్ కోసం విజ‌య్ సిద్ధ‌మ‌య్యారు. ప‌వ‌న్ కల్యాణ్ పుట్టిన రోజున 'ఖుషీ' సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడిగా స‌మంత న‌టిస్తున్నారు. 

రౌడీ హీరో దూకుడు

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Devarakonda), స‌మంత (Samantha), హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న 'ఖుషి' సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ. ప‌వ‌న్ క‌ల్యాణ్, భూమిక న‌టించిన 'ఖుషి' సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. అదే టైటిల్‌తో విజ‌య్ సినిమా చేస్తున్నారు. విజ‌య్ కొత్త సినిమా షూటింగ్‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజున మొద‌లు పెట్ట‌డం విశేషం. తాజా షూటింగ్ షెడ్యూల్ ప్ర‌కారం కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తార‌ట‌. 

శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో 'ఖుషి' రొమాంటిక్ ల‌వ్, థ్రిల్ల‌ర్ సినిమాగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్ర‌ తొలి షెడ్యూల్ క‌శ్మీర్‌లో జ‌రిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 'ఖుషీ' డిసెంబర్ 23న విడుదల కానుంది.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 'ఖుషీ' సినిమాలో జయరామ్, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ న‌టిస్తున్నారు. మలయాళీ సినిమా హృదయం ఫేమ్ హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. 

Read More: Kushi: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత‌ల‌పై వ‌చ్చిన వార్త‌లు నిజం కాదంటున్న‌ ద‌ర్శ‌కుడు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!