ఖుషీ (Kushi) కొత్త పోస్టర్ విడుదల : స్టైలిష్ లుక్‌లో విజయ్ దేవరకొండ.. కుందనపు బొమ్మగా సమంత

Updated on May 16, 2022 12:27 PM IST
మైత్రీ మూవీస్ బ్యాన‌ర్‌ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం, డిసెంబ‌ర్ 23న తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళం భాష‌ల్లో కూడా రిలీజ్ కానుంది.
మైత్రీ మూవీస్ బ్యాన‌ర్‌ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం, డిసెంబ‌ర్ 23న తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళం భాష‌ల్లో కూడా రిలీజ్ కానుంది.

అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాల ద్వారా టాలీవుడ్‌లో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకున్న నటుడు విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda). ఈయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన "లైగ‌ర్" చిత్రం ప్రస్తుతం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఆగ‌స్టు 25న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రంలో అంతర్జాతీయ బాక్సర్ మైక్ టైసన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఇటీవలి కాలంలో "జ‌న‌గ‌ణ‌మ‌న" అనే మరో సినిమాకు కూడా సైన్ చేశాడు విజయ్. లైగ‌ర్ విడుద‌ల త‌ర్వాతే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. 

ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు విజయ్. కాశ్మీర్‌ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంపై, ప్రేక్షకులకు మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్ట‌ర్‌ను నిర్మాతలు విడుద‌ల చేశారు.

ఈ పోస్ట‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ సిగరెట్ తాగుతూ, ఒక డిఫరెంట్ స్టైల్ లో కనిపిస్తాడు. అలాగే స‌మంత పెళ్ళి కూతురు గెటప్‌లో కుందనపు బొమ్మలా ఉంది. ఈ చిత్రానికి ‘ఖుషి’ (Kushi) అనే టైటిల్‌ను ఫైనలైజ్ చేస్తూ మేకర్స్ ఓ మోషన్ పోస్ట‌ర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ డిఫెన్స్ ఉద్యోగిగా క‌నిపించనున్నాడు.

మైత్రీ మూవీస్ బ్యాన‌ర్‌ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం, డిసెంబ‌ర్ 23న తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళం భాష‌ల్లో కూడా రిలీజ్ కానుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!