Yashoda teaser: 'య‌శోద' టీజ‌ర్ రిలీజ్ - గ‌ర్భ‌వ‌తిగా న‌టించిన స‌మంత‌ (Samantha Ruth Prabhu)

Updated on Sep 09, 2022 11:31 AM IST
Yashoda teaser: స‌మంత లీడ్ క్యారెక్ట‌ర్‌లో న‌టించిన పాన్ ఇండియా సినిమా 'య‌శోద'  నుంచి మేక‌ర్స్ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు.
Yashoda teaser: స‌మంత లీడ్ క్యారెక్ట‌ర్‌లో న‌టించిన పాన్ ఇండియా సినిమా 'య‌శోద'  నుంచి మేక‌ర్స్ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు.

Yashoda teaser: తెలుగు సినిమా ఇండ్ర‌స్ట్రీలో టాప్ హీరోయిన్ల‌లో స‌మంత (Samantha Ruth Prabhu) ఒక‌రు. క్యూట్ పాత్ర‌లే కాకుండా లీడ్ రోల్‌లో కూడా సూప‌ర్‌గా న‌టించి ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. ప్ర‌స్తుతం స‌మంత స‌రి కొత్త క్యారెక్ట‌ర్ల‌తో ప్రేక్ష‌కులకు వినోదం పంచ‌నున్నారు. స‌మంత లీడ్ క్యారెక్ట‌ర్‌లో న‌టించిన పాన్ ఇండియా సినిమా 'య‌శోద'  నుంచి మేక‌ర్స్ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. ప్రెగ్నెంట్ లేడీగా స‌మంత క‌నిపించ‌డంతో సినిమాపై ఆసక్తి మ‌రింత పెరిగింది. 

ఆస‌క్తిగా సాగిన‌ టీజ‌ర్

స‌మంత (Samantha Ruth Prabhu) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన 'య‌శోద' చిత్రం పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల కానుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ రిలీజ్ చేశారు. స‌మంత ప్రెగ్నెంట్ అని జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని డాక్ట‌ర్ చెబుతుంది. కానీ స‌మంత ఎన్నో స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించాల్సి ఉంటుంది. ఎంతో మందిపై పోరాడుతుంది. స‌మంత ప్రెగ్నెంట్‌గా ఉండి కూడా ఎందుకంత ప‌ట్టుద‌ల‌తో ఉంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే.  

సైన్స్,  ఫ్రిక్ష‌న్, థ్రిల్ల‌ర్ సినిమాగా 'య‌శోద' సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాకు హ‌రి, హ‌రీష్‌లు ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్‌పై నిర్మి స్తున్నారు. నిర్మాతగా శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్‌లు  య‌శోద సినిమాలో న‌టిస్తున్నారు. 

కొత్త క‌థ‌ల‌తో వినోదం

సమంతకు ‘ది ఫ్యామిలీ మేన్’ సిరీస్ సీజన్ 2 ఓ రేంజ్‌లో పేరు తెచ్చి పెట్టింది. స‌మంత క్రేజ్ మ‌రింత పెంచేలా 'య‌శోద' సినిమా ఉంటుంద‌ని  నిర్మాత శివలెంక చెప్పారు. 'య‌శోద' సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో మేక‌ర్స్  ప్ర‌క‌టించ‌లేదు.

'ది ఫ్యామిలీ మేన్' సీజ‌న్ 2 కు మించి స‌మంత వినోదం అందిస్తార‌ని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. 'య‌శోద' సినిమాను ముందుగా ఆగ‌స్టు 12 తేదీన రిలీజ్ చేయాల‌నుకున్నారు.. కానీ కొన్ని కార‌ణాల‌తో వాయిదా వేశారు. ఈ సినిమా విడుద‌ల తేదీని మేక‌ర్స్ ప్ర‌క‌టించాల్సి ఉంది.

Read More: Samantha: స‌మంత య‌శోద సినిమా ఎలా ఉండ‌బోతుందంటే...

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!