Shakuntalam: 'శాకుంత‌లం' ప్రేమ‌క‌థ రెడీ అంటున్న‌ గుణ‌శేఖ‌ర్.. స‌మంత‌ (Samantha)కు అల్లు అర్హ ఏమ‌వుతుంది?.

Updated on Sep 14, 2022 06:57 PM IST
 'శాకుంత‌లం' సినిమా నుంచి విడుద‌లైన‌ స‌మంత (Samantha)  ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.
'శాకుంత‌లం' సినిమా నుంచి విడుద‌లైన‌ స‌మంత (Samantha) ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత (Samantha) న‌టిస్తున్న సినిమాల్లో 'శాకుంత‌లం' ప్ర‌త్యేక‌మైంది. 'రుద్ర‌మదేవి' సినిమాతో హిస్ట‌రీ క్రియేట్ చేసిన‌ ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు గుణశేఖ‌ర్ పీరియాడిక‌ల్ స్టోరీగా 'శాకుంతలం' సినిమాను చిత్రీక‌రిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుద‌లైన‌ స‌మంత ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ పోస్ట‌ర్‌లో స‌మంత దేవ‌క‌న్య‌లా మెరిసిపోయారు. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ న‌టించ‌డం విశేషం. 

అద్భుత‌మైన ప్రేమ‌కావ్యం - గుణ‌శేఖ‌ర్

మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా 'శాకుంత‌లం' సినిమాను గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. శకుంతల, దుష్యంతుల ప్రేమకథను వెండితెర‌పై ఆవిష్క‌రించ‌నున్నారు గుణ‌శేఖ‌ర్. ఈ సినిమాలో స‌మంత (Samantha) టైటిల్ రోల్‌లో న‌టిస్తున్నారు. దేవ్ మోహన్ దుష్యంతుడుగా క‌నిపించ‌నున్నారు. వీరిద్ద‌రి ప్రేమక‌థ‌పై అప్‌డేట్స్ త‌ర్వ‌లో ప్ర‌క‌టిస్తామ‌ని గుణ‌శేఖ‌ర్ తెలిపారు.  

హిరణ్యకశిపుడికి నరసింహస్వామి అవ‌తారం క‌నిపించే ముందు ఎలాంటి అద్భుతాలు జ‌రుగుతాయో.. శాకుంత‌లం అనే ప్రేమ‌క‌థ కూడా విడుద‌ల‌కు ముందు అదే స్థాయిలో ఆస‌క్తి క‌లిగిస్తుంద‌ని గుణ‌శేఖ‌ర్ తెలిపారు. 'శాకుంతలం'  సినిమా ప్రేక్ష‌కుల ముందుకు అతి త్వ‌ర‌లో తీసుకొస్తాన‌న్నారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌ను త్వ‌ర‌లో మొద‌లు  కానున్నాయ‌ని గుణ‌శేఖ‌ర్ ట్వీట్ చేశారు. 

భ‌ర‌తుడిగా అల్లు అర్హ

'శాకుంతలం' చిత్రంలో దుర్వాస మునిగా మోహ‌న్ బాబు న‌టిస్తున్నారు. శకుంత‌ల కుమారుడు భ‌ర‌తుడి పాత్ర‌లో అల్లు అర్హ న‌టించ‌నున్నారు. ఈ చిత్రాన్ని గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ నిర్మిస్తున్నారు. గుణ‌టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు.

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్ఫ‌ణ‌లో 'శాకుంత‌లం' చిత్రం విడుద‌ల కానుంది. ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. గుణ‌టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై అంత‌కు ముందు అనుష్క శెట్టి న‌టించిన‌ 'రుద్ర‌మ‌దేవి' సినిమాను నిర్మించారు. 'రుద్ర‌మ‌దేవి' బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించింది. 

Read More: సమంత (Samantha) 'శాకుంతలం' (Shakuntalam) నుంచి బిగ్ అప్ డేట్.. గ్రాఫికల్ వర్క్ లో బిజీగా మూవీ యూనిట్..!

 'శాకుంత‌లం' సినిమా నుంచి విడుద‌లైన‌ స‌మంత (Samantha)  ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!