'లైగ‌ర్' ( Liger ) ల‌వ్ సాంగ్ రిలీజ్.. కొత్త స్టెప్పుల‌తో ఇర‌గ‌దీసిన విజ‌య్‌ (Vijay Devarakonda), అన‌న్య

Updated on Aug 06, 2022 12:49 PM IST
 Liger: ‘ఆఫ‌ట్’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండేలు సిగ్నేచ‌ర్ స్టెప్స్‌తో అద‌ర‌గొట్టారు.
Liger: ‘ఆఫ‌ట్’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండేలు సిగ్నేచ‌ర్ స్టెప్స్‌తో అద‌ర‌గొట్టారు.

Liger: టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda) న‌టించిన పాన్ ఇండియా సినిమా 'లైగ‌ర్' నుంచి మేక‌ర్స్ ల‌వ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘ఆఫ‌ట్’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండేలు సిగ్నేచ‌ర్ స్టెప్స్‌తో అద‌ర‌గొట్టారు. ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఆగ‌స్టు 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. 'లైగ‌ర్' చిత్ర ప్ర‌మోష‌న్లు జోరుగా సాగుతున్నాయి. ఇటీవ‌లే రిలీజ్ అయిన ట్రైల‌ర్, అక్‌డి... ప‌క్‌డి పాటలు యూట్యూబ్‌లో దూసుకెళుతున్నాయి.

ల‌వ్ సాంగ్ రిలీజ్

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Devarakonda), పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన 'లైగ‌ర్' సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమా నుండి తాజాగా ‘ఆఫ‌ట్’ పాట‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో ప్రేక్షకులకు అత్యంత ప‌వ‌ర్‌నిచ్చే పాట‌గా ‘ఆఫ‌ట్’ కొత్త రికార్డులు బ్రేక్ చేస్తుందంటూ విజ‌య్ దేవ‌రకొండ ట్వీట్ చేశారు. ఈ పాట‌కు భాస్క‌రభ‌ట్ల లిరిక్స్ రాశారు. 

‘ఆఫ‌ట్’ పాట‌ను గాయ‌కులు సింహా, శ్రావ‌ణ భార్గవి ఆలపించారు. ఈ పాటకు గాను విజ‌య్, అనన్య వేసిన స్టెప్పులు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఈ గీతానికి త‌నిష్క్ బాగ్చీ సంగీతం స‌మ‌కూర్చారు. పియూష్, షాజియా కొరియోగ్రాఫ‌ర్లుగా వ్య‌వ‌హ‌రించారు. ‘ఆఫ‌ట్’ పాట‌ను శుక్ర‌వారం విడుద‌ల చేయాల‌కున్నారు. కానీ సాంకేతిక కార‌ణాల‌తో శ‌నివారం విడుద‌ల చేశారు.

భారీ బడ్జెట్‌ సినిమా 'లైగ‌ర్'

'లైగ‌ర్' సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే న‌టించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, మైక్ టైసన్, రోనిత్ రాయ్, విషు రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరీ జగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 'లైగ‌ర్' ఆగ‌స్టు 25న విడుద‌ల కానుంది. ఈ సినిమాను రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో హీరోయిన్ ఛార్మి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌లు నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో  విడుదల కానుంది. 

Read More: Liger: ముంబైలో మెట్రో రైలు ఎక్కిన 'లైగ‌ర్' జోడి!.. డాన్సులేసిన విజ‌య్ (Vijay Devarakonda), అన‌న్య‌

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!