Liger : ‘లైగర్’ యాటిట్యూడ్ సాంగ్ పాడిన విజయ్ (Vijay Deverakonda).. లిరిక్స్ రాసిన పూరీ
Liger: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న 'లైగర్' చిత్రం నుంచి పవర్ ఫుల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'వాట్ లగా దేంగే' అనే మాస్ లిరిక్స్ తో, చాలా డిఫరెంట్ గా ఈ పాట సాగుతుంది. ఈ పాటను దర్శకుడు పూరీ జగన్నాథ్ రాయగా.. విజయ్ దేవరకొండ ఆలపించారు. 'పోదాం.. కొట్లాడదాం.. వి ఆర్ ఇండియన్స్' అంటూ విజయ్ పవర్ ఫుల్ వాయిస్‌తో ఈ పాట సాగుతుంది. ఈ పాటను తీన్‌మార్ స్టెప్పులతో వైవిధ్యంగా చిత్రీకరించారు. 'లైగర్' యాటిట్యూడ్ పేరుతో ఈ పాటను ఇటీవలే విడుదల చేసారు.
'లైగర్' యాటిట్యూడ్ వీడియో!
'లైగర్' సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. పాన్ ఇండియా సినిమాగా 'లైగర్' ఆగస్టు 25న రిలీజ్ కానుంది. భారీ యాక్షన్ సినిమాగా 'లైగర్' ఓ వండర్ క్రియేట్ చేస్తుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పాత్రకు ఉండే ప్రాధాన్యాన్ని, ప్రాముఖ్యతను, అతని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే అంశాలను తెలిపే గ్లింప్స్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. #WaatLagaDenge అనే హాష్ ట్యాగ్‌తో ఈ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ పాటకు పూరీ జగన్నాథ్ లిరిక్స్ అందించగా.. విజయ్ దేవరకొండ సాంగ్ పాడారు. సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చారు.
లైగర్'గా విజయ్ ప్రత్యర్ధులను పరిగెత్తించి మరీ చితకబాదే విజువల్స్ ఆసక్తిగా ఉన్నాయి. అలాగే ట్రైన్‌లో ఫైట్ సీన్ ఓ రేంజ్‌లో ఉంటుంది. మాస్ డైలాగులు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. ఇటీవలే ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా తన బోల్డ్ ఫోటోలను రిలీజ్ చేసి.. విజయ్ దేవరకొండ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ సంచలనంగా మారారు. ఇక 'లైగర్' థియేటర్లలో ఎలాంటి రచ్చ చేయనుందో చూడాలి మరి.
రూ. 125 కోట్ల భారీ బడ్జెట్ సినిమా
'లైగర్' సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, మైక్ టైసన్, రోనిత్ రాయ్, విషు రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా 'లైగర్' ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సినిమాను రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో హీరోయిన్ ఛార్మి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌లు నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Read More : 'లైగర్' కోసం నత్తిగా మాట్లాడటం నేర్చుకున్నా.. కామెడీ కూడా : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)