Liger: ముంబైలో మెట్రో రైలు ఎక్కిన 'లైగ‌ర్' జోడి!.. డాన్సులేసిన విజ‌య్ (Vijay Devarakonda), అన‌న్య‌

Updated on Jul 29, 2022 02:13 PM IST
Liger: విజ‌య్ (Vijay Devarakonda), అన‌న్య‌లు క‌లిసి 'లైగ‌ర్' ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొన్నారు. ముంబైలోని మెట్రో ట్రైన్‌లో హంగామా చేశారు.
Liger: విజ‌య్ (Vijay Devarakonda), అన‌న్య‌లు క‌లిసి 'లైగ‌ర్' ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొన్నారు. ముంబైలోని మెట్రో ట్రైన్‌లో హంగామా చేశారు.

Liger: టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda) న‌టించిన 'లైగ‌ర్' సినిమా ప్ర‌మోష‌న్లను మేక‌ర్స్ ఓ రేంజ్‌లో ప్లాన్ చేశారు. 'లైగ‌ర్ - సాలా క్రాస్ బ్రీడ్' ఆగ‌స్టు 25న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. పూరీ ద‌ర్శ‌క‌త్వంలో 'లైగ‌ర్' పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కింది. విజ‌య్, అన‌న్య‌లు క‌లిసి 'లైగ‌ర్' ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొన్నారు. ముంబైలోని మెట్రో ట్రైన్‌లో విజ‌య్, అన‌న్య‌లు హంగామా చేశారు. ముంబైలో ట్రాఫిక్‌ను త‌గ్గించేందుకు విజ‌య్, అన‌న్య‌లు మెట్రో స్టేష‌న్‌లో' లైగ‌ర్' ప్ర‌మోష‌న్లు నిర్వ‌హించారు. 

 

ముంబైలో విజ‌య్, అన‌న్య‌ల సంద‌డి

'లైగ‌ర్' సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Devarakonda) కు ఫాలోయింగ్ మ‌రింత పెరిగింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండేలు ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. విజ‌య్, అన‌న్య‌లు ముంబైలో మెట్రో రైలు ఎక్కారు. ఆ త‌ర్వాత ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వీరు అక్‌డి... ప‌క్‌డి పాట‌కు స్టెప్పులేశారు. ఈ జంట రీసెంట్‌గా బాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ నిర్వ‌హిస్తున్న‌ 'కాఫీ విత్ క‌రణ్' షోలో పాల్గొన్నారు. ఆ షోలో క‌ర‌ణ్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు విజ‌య్ చెప్పిన స‌మాధానాలు వైర‌ల్‌గా మారాయి.

Liger: విజ‌య్ (Vijay Devarakonda), అన‌న్య‌లు క‌లిసి 'లైగ‌ర్' ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొన్నారు. ముంబైలోని మెట్రో ట్రైన్‌లో హంగామా చేశారు.

సింగ‌ర్‌గా విజ‌య్.. లిరిక్స్ రాసిన పూరీ

లైగ‌ర్ నుంచి మరో పాట‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.  ‘లైగర్’ యాటిట్యూడ్ సాంగ్‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda) పాడ‌గా.. పూరీ జ‌గ‌న్నాథ్ లిరిక్స్ అందించారు. ఈ సినిమాలో లైగ‌ర్ మాస్ట‌ర్‌గా బాలీవుడ్ న‌టుడు రోనిత్ రాయ్ న‌టిస్తున్నారు. కోచ్‌గా రోనిత్ రాయ్ అద‌ర‌గొట్ట‌నున్నారు. విజ‌య్ త‌ల్లి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ‌న్ న‌టిస్తున్నారు.బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ లైగ‌ర్ సినిమాలో ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

Read More: Liger : ‘లైగర్’ యాటిట్యూడ్ సాంగ్ పాడిన విజ‌య్ (Vijay Deverakonda).. లిరిక్స్ రాసిన పూరీ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!