Liger : 'లైగ‌ర్' ట్రైనింగ్ మాస్ట‌ర్ వీడియో రిలీజ్!.. గురువు పాత్ర‌లో బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు

Updated on Jul 27, 2022 05:44 PM IST
Liger : విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు బాక్సింగ్‌లో శిక్ష‌ణ ఇచ్చే గురువు పాత్ర‌లో బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు రోనిత్ రాయ్ న‌టించారు.
Liger : విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు బాక్సింగ్‌లో శిక్ష‌ణ ఇచ్చే గురువు పాత్ర‌లో బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు రోనిత్ రాయ్ న‌టించారు.

Liger: టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) న‌టిస్తున్న‌ 'లైగ‌ర్' సినిమా నుంచి మ‌రో లేటెస్ట్ అప్‌డేట్‌ విడుదలైంది. 'లైగ‌ర్‌'కు ట్రైనింగ్ ఇస్తున్న మాస్ట‌ర్‌పై మేకర్స్ ఓ వీడియోను రూపొందించి, విడుదల చేశారు.  'లైగ‌ర్‌'లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మాస్ట‌ర్‌గా ఓ బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు న‌టించారు. ఆయన ఎవ‌రో తెలుసుకుందాం.

గురువు పాత్ర‌లో రోనిత్ రాయ్ 

'లైగ‌ర్' చిత్రం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రిలీజ్ కానుంది. తాజాగా విడుద‌లైన‌ 'లైగ‌ర్' ట్రైల‌ర్ ఓ వండ‌ర్‌ను క్రియేట్ చేసింది. ఇదే క్రమంలో చిత్ర యూనిట్ తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ 'లైగ‌ర్'కి మాస్ట‌ర్‌గా నటిస్తున్నారంటూ అదే వీడియోని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'ప్ర‌తిభ‌ను ప్రొత్స‌హించే వారే నిజ‌మైన గురువు' అంటూ ట్వీట్ చేసింది.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రోనిత్ రాయ్‌ల మ‌ధ్య జ‌రిగే  సీన్లు ఈ సినిమాలో హైలెట్ కానున్నాయ‌ట‌. 'త‌ప్పు చేస్తే దండించడం.. ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించ‌డం.. ఓ గురువు ల‌క్ష‌ణం' అనేది ట్యాగ్ లైన్. లైగ‌ర్‌లో అలాంటి గురువు పాత్ర‌లో రోనిత్ రాయ్ వెండితెర‌పై క‌నిపించి.. విజయ్ అభిమానులకు వినోదం పంచ‌నున్నారు.

 

రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌ సినిమా

'లైగ‌ర్' సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే న‌టించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, మైక్ టైసన్, రోనిత్ రాయ్, విషు రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరీ జగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 'లైగ‌ర్' ఆగ‌స్టు 25న విడుద‌ల కానుంది. ఈ సినిమాను రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో హీరోయిన్ ఛార్మి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌లు నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో  విడుదల కానుంది. 

Read More : 'లైగ‌ర్' కోసం న‌త్తిగా మాట్లాడ‌టం నేర్చుకున్నా.. కామెడీ కూడా : విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!