చిరంజీవి (Chiranjeevi) సినిమాలో వెంకీమామ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్!

Updated on Sep 13, 2022 10:51 AM IST
చిరంజీవి (Chiranjeevi) 'మెగా 154' సినిమాలో  సినిమాలోప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించేందుకు మ‌రో స్టార్ హీరో సిద్ధ‌మ‌య్యార‌ట‌. 
చిరంజీవి (Chiranjeevi) 'మెగా 154' సినిమాలో సినిమాలోప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించేందుకు మ‌రో స్టార్ హీరో సిద్ధ‌మ‌య్యార‌ట‌. 

టాలీవుడ్ మెగాస్టార్  చిరంజీవి (Chiranjeevi) న‌టిస్తున్న'మెగా 154' సినిమా అప్‌డేట్స్ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని పెంచుతున్నాయి. 'ఆచార్య' ఫ్లాప్ త‌రువాత చిరంజీవి వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. బ‌ల‌మైన క‌థ‌లున్న సినిమాల్లో న‌టిస్తున్నారు. చిరు న‌టిస్తున్న సినిమాల్లో 'మెగా 154' ప‌వ‌ర్ ఫుల్ క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 'మెగా 154' సినిమాలో ర‌వితేజ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలోప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించేందుకు
మ‌రో స్టార్ హీరో సిద్ధ‌మ‌య్యార‌ట‌. 

టైటిల్ ఖారారైన‌ట్టేనా!

'మెగా 154' సినిమాలో చిరంజీవి ఓ మత్స్యకారుడి పాత్ర‌లో న‌టించ‌నున్నార‌ట‌. ద‌ర్శ‌కుడు బాబి స‌రికొత్త క‌థ‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. 'మెగా 154' సినిమాకు 'వాల్తేరు వీర‌య్య' అనే టైటిల్ ఖ‌రారు చేస్తార‌ని టాక్. చిరంజీవి (Chiranjeevi), ర‌వితేజ అన్న‌ద‌మ్ములుగా ఈ సినిమాలో న‌టిస్తున్నారు.

ఇద్దరూ సవతి తల్లి పిల్లలుగా క‌నిపిస్తార‌ని..  సినిమాలో వీరి మధ్య కొన్ని భావోద్వేగ సన్నివేశాలు, ఆవేశపూరితమైన సంభాషణలు కూడా ఉంటాయ‌నే వార్త‌లు అంతర్జాలంలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సిఉంది. 

చిరంజీవి (Chiranjeevi) 'మెగా 154' సినిమాలో  సినిమాలోప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించేందుకు మ‌రో స్టార్ హీరో సిద్ధ‌మ‌య్యార‌ట‌. 

చిరు సినిమాలో వెంకీమామ‌

విక్ట‌రీ వెంక‌టేష్ న‌ట‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. వెంక‌టేష్ 'మెగా 154' సినిమాలో న‌టిస్తున్నార‌ట‌. చిరంజీవితో క‌లిసి వెంక‌టేష్ వెండితెర‌పై వినోదం పంచ‌నున్నారు. గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన‌ 'గోపాల గోపాల', 'అజ్ఞాత‌వాసి' సినిమాల్లో వెంకీ మామ గెస్ట్ రోల్‌లో క‌నిపించారు. అలాగే చిరంజీవి సినిమాలో కూడా ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించాల‌ని బాబి కోరార‌ట‌. అందుకు వెంకీ మామ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ఈ విష‌యంపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌ట‌న చేయాల్సి ఉంది. 

'మెగా 154' సినిమాలో చిరు అండ‌ర్ క‌వ‌ర్ కాప్‌గా క‌నిపించ‌నున్నారు. చిరుకు జోడిగా శృతిహాస‌న్ న‌టిస్తున్నారు.  మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ యెర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాదిలో ఈ సినిమా విడుద‌ల కానుంది. 

Read More : Raviteja & Chiranjeevi: 'మెగా 154' (Mega 154) షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టిన మాస్ మహారాజ్ రవితేజ..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!