కామెడీ ఇష్టపడే సినీ ప్రేమికులు మిస్ కాకూడని పది టాలీవుడ్‌ (Tollywood) సినిమాలు

Updated on Jul 01, 2022 10:03 PM IST
చిరంజీవి, వెంకటేష్, రవితేజ, నరేష్, రాజేంద్రప్రసాద్, అల్లరి నరేష్, బ్రహ్మానందం
చిరంజీవి, వెంకటేష్, రవితేజ, నరేష్, రాజేంద్రప్రసాద్, అల్లరి నరేష్, బ్రహ్మానందం

నవ్వడం ఒక యోగం.. నవ్వించడం ఒక భోగం.. నవ్వకపోవడం ఒక రోగం అన్నారొక పెద్దాయన

ఒక్క చిరునవ్వు చాలు.. ఎంతటి కష్టాన్నైనా చెదరగొడుతుంది.

ఒక్క చిరునవ్వు చాలు.. ఎంతటి శత్రువునైనా మిత్రుడిని చేస్తుంది.

ఒక్క చిరునవ్వు చాలు.. ఎంతటి బాధనైనా దూరం చేస్తుంది.

మనస్పూర్తిగా నవ్వే నవ్వు ఒంట్లోని రోగాలన్నింటినీ తరిమి కొడుతుందని చెబుతారు డాక్టర్లు.ఇంటా, బయటా తలకు మించిన సమస్యలతో సతమతమయ్యే సగటు మనిషిని కాసేపైనా కడుపుబ్బా నవ్వించగలిగేవి కామెడీ సినిమాలు. అందుకే కామెడీ జోనర్ సినిమాలకు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తుంటారు. టాలీవుడ్‌లో ఇప్పటివరకు వచ్చిన అనేక కామెడీ సినిమాల్లో మొదటి వరుసలో ఉండే హాస్యభరిత చిత్రాల్లో కొన్ని..

చంటబ్బాయ్ సినిమా పోస్టర్

చంటబ్బాయ్ (Chantabbai)

మెగాస్టార్ చిరంజీవి, సుహాసిని హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘చంటబ్బాయ్’. జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మల్లాది వెంకటకృష్ణమూర్తి రచించిన ‘చంటబ్బాయ్’ అనే నవల ఆధారంగా రూపొందింది. సుత్తివేలు, ముచ్చర్ల అరుణ, అల్లు అరవింద్, చంద్రమోహన్, రావి కొండలరావు, భీమ రాజు, అల్లు రామలింగయ్య, సాక్షి రంగారావు, శ్రీలక్ష్మి కీలకపాత్రల్లో నటించారు. కె.చక్రవర్తి సంగీతం అందించిన చంటబ్బాయ్‌ సినిమాను జ్యోతి ఆర్ట్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది.

అహ నా పెళ్లంట సినిమా పోస్టర్

అహ నా పెళ్లంట (Aha Naa Pellanta)

రాజేంద్రప్రసాద్‌, రజనీ హీరోహీరోయిన్లుగా హాస్య బ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అహ నా పెళ్లంట’. డి.రామానాయుడు నిర్మాణ సారధ్యంలో రూపొందిన ఈ సినిమాతో కోటా శ్రీనివాసరావు, నూతన్‌ ప్రసాద్, బ్రహ్మానందం సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. రమేష్‌ నాయుడు సంగీతం అందించిన ‘అహ నా పెళ్లంట’ సినిమా కథను సత్యం గారి ఇల్లు అనే నవల ఆధారంగా తీసుకున్నారు. సుమారు రూ.16 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.5 కోట్లు వసూలు చేసింది. నవంబర్‌‌ 27, 1987వ సంవత్సరంలో రిలీజైన అహ నా పెళ్లంట సినిమాలో సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు, శుభలేఖ సుధాకర్, బాబూ మోహన్, గుండు హనుమంతరావు కీలకపాత్రల్లో నటించారు.

జంబలకిడిపంబ సినిమా పోస్టర్

జంబలకిడిపంబ (Jambalakidipamba)

నరేష్, ఆమని హీరోహీరోయిన్లుగా నటించిన ‘జంబలకిడిపంబ’ సినిమాను ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా 1992 జూలై 12వ తేదీన రిలీజై ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో కామెడీకి థియేటర్లలో ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకునేవారు. ‘జంబలకిడిపంబ’ సినిమాకు రాజ్‌‌–కోటి అందించిన సంగీతం హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి.

ఆ ఒక్కటీ అడక్కు సినిమా పోస్టర్

ఆ ఒక్కటీ అడక్కు (Aa Okkati Adakku)

1992 సెప్టెంబర్‌‌ 19వ తేదీన థియేటర్లలోకి రిలీజైంది రాజేంద్రప్రసాద్, రంభ హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఏ పనీ చేయకుండా అదృష్టాన్ని, జాతకాలనూ నమ్మే వ్యక్తిగా రాజేంద్రప్రసాద్ నటించారు.  రిటైర్ట్‌ స్టేషన్ మాస్టర్‌‌గా అల్లు రామలింగయ్య, జ్యోతిషుడిగా బాబూమోహన్‌, రాజేంద్రప్రసాద్‌ తల్లిగా నిర్మలమ్మ, చెల్లెలి క్యారెక్టర్‌‌ చేసిన నటి శ్రీలత వాళ్ల వాళ్ల డైలాగులతో నవ్వులు పూయిస్తారు. ఈ సినిమాకు కూడా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు.

క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమా పోస్టర్

క్షేమంగా వెళ్లి లాభంగా రండి (Kshemanga Velli Laabhamga Randi)

రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, బ్రహ్మానందం, రోజా, ప్రీతి, కోవై సరళ, ప్రకాష్‌ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’. ఫిబ్రవరి 4, 2000వ సంవత్సరంలో రిలీజైన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్‌ సంగీతం అందించారు. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎంఎల్ మూవీ ఆర్ట్స్‌ సంస్థ నిర్మించింది.

నువ్వు నాకు నచ్చావ్ సినిమా పోస్టర్

నువ్వు నాకు నచ్చావ్ (Nuvvu Naaku Nachaav)

విక్టరీ వెంకటేష్‌, ఆర్తి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘నువ్వు నాకు నచ్చావ్’. కె.విజయ్ భాస్కర్‌‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, స్రవంతి మూవీస్ బ్యానర్లపై డి.సురేష్‌ బాబు, స్రవంతి రవికిషోర్‌‌ నిర్మించారు. కోటి సంగీతం అందించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కథను అందించారు. 2001, సెప్టెంబర్‌‌ 6వ తేదీన రిలీజైన ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్, చంద్రమోహన్, సునీల్, బ్రహ్మానందం, ఆశా సైని కీలకపాత్రల్లో నటించారు.

కితకితలు సినిమా పోస్టర్

కితకితలు (Kithakithalu)

అల్లరి నరేష్, గీతా సింగ్ హీరోహీరోయిన్లుగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కితకితలు’. తనికెళ్లభరణి, గిరిబాబు, జయప్రకాష్‌ రెడ్డి, కృష్ణభగవాన్, లక్ష్మీపతి, ఎమ్మెస్ నారాయణ, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కీలకపాత్రల్లో నటించారు.సత్యం సంగీతం అందించిన కితకితలు సినిమాలో మధు శాలినీ సెకండ్ హీరోయిన్‌గా చేశారు. మే 5వ తేదీ 2006లో రిలీజైన కితకితలు సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది.

కృష్ణ సినిమా పోస్టర్

కృష్ణ (Krishna)

రవితేజ, త్రిష హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన పక్క కామెడీ ఎంటర్‌‌టైనర్‌‌ ‘కృష్ణ’. ఔట్‌ అండ్‌ ఔట్‌ కామెడీ ఎంటర్‌‌టైనర్‌‌గా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు వీవీ వినాయక్. చక్రి సంగీతం అందించిన కృష్ణ సినిమా డీవీవీ దానయ్య, బి.కాశీ విశ్వనాధం నిర్మాణ సారధ్యంలో తెరకెక్కింది. జనవరి 12వ తేదీ 2008న రిలీజైన కృష్ణ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌‌హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. గిరిబాబు, షాయాజీ షిండే, ముకుల్‌ దేవ్, బ్రహ్మానందం, సునీల్ నటించారు.

ఢీ సినిమా పోస్టర్

ఢీ (Dhee)

మంచు విష్ణు, జెనీలియా జంటగా శ్రీహరి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఢీ’. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు కోటి సంగీతం అందించారు. కోన వెంకట్, గోపీ మోహన్ అందించిన కథతో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మానందం, సునీల్, జయప్రకాష్‌ రెడ్డి, శ్రీనివాస రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 13వ తేదీ 2007లో తెరకెక్కిన ఢీ సినిమాను సుమారు రూ.5 కోట్ల బడ్జెట్‌తో సిరి వెంకటేశ్వర ఫిలింస్ మల్లిడి సత్యనారాయణ రెడ్డి నిర్మాణ సారధ్యంలో తెరకెక్కించింది.

జాతిరత్నాలు సినిమా పోస్టర్

జాతిరత్నాలు (Jathi Ratnalu)

నవీన్ పోలిశెట్టి, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, మురళీశర్మ, నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘జాతిరత్నాలు’. కేవీ అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాగ్‌ అశ్విన్ నిర్మించారు. మార్చి 11, 2021న రిలీజైన ఈ సినిమా రూ.4 కోట్లతో తెరకెక్కింది. కాగా, సుమారు రూ.75 కోట్లు వసూలు చేసిందని అంచనా.

డీజే టిల్లు సినిమా పోస్టర్

డీజే టిల్లు (DJ Tillu)

సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన క్రైమ్‌ కామెడీ సినిమా ‘డీజే టిల్లు’. విమల్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సితార ఎంటర్‌‌టైన్‌మెంట్స్‌ నిర్మించింది. శ్రీ చరణ్‌ పాకాల సంగీతం అందించిన డీజే టిల్లు సినిమాకు నవీన్‌ నూలి ఎడిటర్‌‌గా వ్యవహరించారు. చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్లలోనూ మంచి వసూళ్లను సాధించింది. సినిమాకు ఖర్చు చేసిన బడ్జెట్‌కు వసూళ్లకు పొంతనే లేనంతగా, ఓవర్సీస్‌లో కూడా వసూళ్ల వర్షం కురిపించాడు డీజే టిల్లు.

ఇవే కాకుండా టాలీవుడ్‌లో కామెడీ ప్రధానంగా చాలా సినిమాలు తెరకెక్కాయి. వాటిలో కొన్ని సినిమాలు చిరకాలం నిలిచిపోతాయి. యాక్షన్‌ సినిమాలు తీసి వసూళ్లు రాబట్టడం ఒక ఎత్తయితే, కామెడీ ప్రధానంగా సినిమాలను తెరకెక్కించి బాక్సాఫీసు వద్ద వాటిని నిలదొక్కుకునేలా చేయడం మరొక ఎత్తు. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించి వసూళ్లు రాబట్టిన సినిమాలు టాలీవుడ్‌ (Tollywood)లో మరెన్నో ఉన్నాయి.

Read More : Anya’s Tutorial Review: థ్రిల్లింగ్‌గా రెజీనా కసాండ్రా, నివేదితా సతీష్‌ ‘అన్యాస్ ట్యుటోరియల్’ వెబ్‌ సిరీస్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!