మెగా154లో చిరంజీవి (Chiranjeevi), రవితేజతోపాటు వెంకటేష్, నాగార్జున (Nagarjuna) కూడా నటించనున్నారా?
ఆచార్య సినిమా తర్వాత వరుస సినిమాలను ఓకే చేస్తూ వాటిని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ప్రస్తుతం నాలుగు సినిమాలు చిరంజీవి చేతిలో ఉన్నాయి. వాటిలో గాడ్‌ఫాదర్ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే ఆ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, గ్లింప్స్ వైరల్ అయ్యాయి. దీంతో గాడ్‌ఫాదర్ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
ఇక, చిరంజీవి చేతిలో ఉన్న మరో సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా154 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఖరారు చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మెగా154 సినిమాలో మాస్ మహారాజా రవితేజ (RaviTeja) కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే దానికి సంబంధించిన స్పెషల్ వీడియోను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. విక్టరీ వెంకటేష్ (Venkatesh) కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయనున్నారనే వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
మరో స్టార్ హీరో కూడా..
మెగా154 సినిమాకు సంబంధించిన మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో చిరంజీవికి తమ్ముడిగా రవితేజ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వెంకటేష్ గెస్ట్ రోల్ చేస్తున్నారనే వార్తలపై క్లారీటీ రాకముందే మరో స్టార్ హీరో కూడా మెగా154లో అతిథి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.
ఆయన మరెవరో కాదు.. టాలీవుడ్ కింగ్ నాగార్జున. ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే మరి. ఏదైనా చిరంజీవి, రవితేజ (RaviTeja), వెంకటేష్ (Venkatesh), నాగార్జున (Nagarjuna) ఒకేసారి స్క్రీన్‌పై కనిపిస్తే అభిమానులకు మాత్రం నిజంగా పండుగే.
మెగా154 సినిమాలో చిరంజీవి (Chiranjeevi) అండర్ కవర్ కాప్‌గా కనిపించనున్నారు. చిరు సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మెగా154 సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
Read More : Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' (God Father) చిత్రం : టాప్ 10 ఆసక్తికర విశేషాలివే