Raviteja & Chiranjeevi: 'మెగా 154' (Mega 154) షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టిన మాస్ మహారాజ్ రవితేజ..!

Updated on Jul 15, 2022 10:44 PM IST
ర‌వితేజ, చిరంజీవి (Raviteja, Chiranjeevi)
ర‌వితేజ, చిరంజీవి (Raviteja, Chiranjeevi)

Raviteja-Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే తాను నటించిన 'ఆచార్య' ఫ‌లితంతో సంబంధం లేకుండా, కొత్త సినిమాల్ని వేగంగా పూర్తిచేస్తున్నారు. ఆయ‌న హీరోగా కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో 'అన్నయ్య' సినిమాలో చిరు తమ్ముడిగా అలరించిన రవితేజ.. తాజాగా మరోసారి మెగాస్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. 

'మెగా 154' (వర్కింగ్ టైటిల్) మూవీలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ (Shruti Haasan) యాక్ట్ చేస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) అనే టైటిల్ ప్రచారంలో ఉంది. వైజాగ్ జాల‌రీపేట బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. 

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. శుక్ర‌వారం ఈ సినిమా సెట్స్‌లో ర‌వితేజ (Raviteja) జాయిన్ అయిన నేపథ్యంలో.. నేటి నుండి ప‌ది రోజుల పాటు చిరంజీవి, ర‌వితేజ‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్న‌ట్లు తెలిస్తోంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ కానుంది. చిరంజీవి ప్రస్తుతం ఈ సినిమాతో పాటుగా గాఢ్‌ఫాద‌ర్‌, భోళాశంక‌ర్ సినిమాల్లో హీరోగా న‌టిస్తున్నారు.

కాగా, మూడేళ్ళ తర్వాత 'క్రాక్' సినిమాతో భారీ హిట్ అందుకున్న రవితేజ కూడా, ప్రస్తుతం వరుసగా అరడజను సినిమాలకు కమిటయ్యాడు. అయితే, క్రాక్ తర్వాత వచ్చిన 'ఖిలాడి' సినిమా అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది.

ఇప్పుడు రవితేజ చేస్తున్న 'రామారావు ఆన్‌డ్యూటీ' (Ramarao on Duty) దసరాకి విడుదల కాబోతుంది. ఈ సినిమా హిట్ అయితే, రవితేజ మళ్ళీ ఫాంలోకి వస్తాడు. లేదంటే కాస్త ఆయన సినీ కెరీర్ రిస్క్‌లో పడుతుంది. రవితేజ చేతిలో ఇంకా ధమాకా, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర చిత్రాలున్నాయి. కానీ ఎంతవరకు అవి కొత్త కథలతో తెరకెక్కుతున్నాయో తెలియదు. 

Read More: Megastar Chiranjeevi: బాలకృష్ణ, నాగార్జున బాటలో మెగాస్టార్ చిరంజీవి.. ఆందోళనలో ఫ్యాన్స్.. కారణమేంటంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!