Hunt Movie : 'హంట్' చిత్రంలో సుధీర్‌బాబు (Sudheerbabu) ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్

Updated on Sep 24, 2022 05:20 PM IST
Hunt Movie : 'హంట్' సినిమా నుంచి మేక‌ర్స్ వ‌రుస పోస్ట‌ర్లు రిలీజ్ చేశారు. సుధీర్ బాబు (Sudheerbabu), శ్రీకాంత్. దేవ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.
Hunt Movie : 'హంట్' సినిమా నుంచి మేక‌ర్స్ వ‌రుస పోస్ట‌ర్లు రిలీజ్ చేశారు. సుధీర్ బాబు (Sudheerbabu), శ్రీకాంత్. దేవ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Hunt Movie : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు (Sudheerbabu) న‌టిస్తున్న 'హంట్' సినిమా నుంచి మేక‌ర్స్ కొత్త పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. స‌రి కొత్త క‌థ‌తో 'హంట్' సినిమాను కొత్త‌ దర్శకుడు మహేష్ సూరపనేని తెర‌కెక్కిస్తున్నారు. 'హంట్' సినిమా నుంచి వ‌రుస పోస్ట‌ర్లు రిలీజ్ చేశారు. సుధీర్ బాబు, శ్రీకాంత్. దేవ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వీరి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. 'హంట్' సినిమా టీజర్ సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ ప‌తాకంపై నిర్మాత‌  వి.ఆనంద్ ప్ర‌సాద్  నిర్మిస్తున్నారు. 

కొత్త లుక్‌లో సుధీర్

 సుధీర్ బాబు (Sudheer Babu) న‌టించిన‌ ‘స‌మ్మోహ‌నం’ మంచి హిట్ ఇచ్చింది. ఆ త‌రువాత రిలీజ్ అయిన  ‘వి’, ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ వంటి సినిమాల‌తో సుధీర్ మ‌రింత పాపుల‌ర్ అయ్యారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. సుధీర్ బాబు నాలుగు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. 

సుధీర్ బాబు (Sudheer Babu)  న‌టిస్తున్న 'హంట్' సినిమా టీజ‌ర్ సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ కానుంది. 'హంట్‌'లో సుధీర్ బాబు అర్జున్ ప్ర‌సాద్ అనే క్యారెక్ట‌ర్‌లో న‌టించ‌నున్నారు. మేక‌ర్స్ రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌లో సుధీర్ బాబు కొత్త లుక్‌లో క‌నిపించారు. పోస్టర్‌లో సుధీర్‌ బాబు చేతిలో సిగరెట్‌ పట్టుకుని సీరియ‌స్ లుక్‌లో క‌నిపించారు.

ఈ సినిమా ప‌క్కా యాక్ష‌న్ సినిమాగా రిలీజ్ కానుంద‌ని స‌మాచారం. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్‌, త‌మిళ న‌టుడు భ‌ర‌త్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వీరికి సంబంధించిన పోస్ట‌ర్ల‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

Read More: సుధీర్ బాబు (Sudheer Babu) కొత్త సినిమా టైటిల్ 'హంట్'.. థ్రిల్ల‌ర్‌గా సాగిన‌ టీజ‌ర్‌!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!