సుధీర్ బాబు (Sudheer Babu) కొత్త సినిమా టైటిల్ 'హంట్'.. థ్రిల్ల‌ర్‌గా సాగిన‌ టీజ‌ర్‌!

Updated on Aug 28, 2022 06:59 PM IST
‘హంట్: గ‌న్స్ డోంట్ లై’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ సుధీర్ బాబు (Sudheer Babu)  సినిమా మోష‌న్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.
‘హంట్: గ‌న్స్ డోంట్ లై’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ సుధీర్ బాబు (Sudheer Babu)  సినిమా మోష‌న్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

HUNT: టాలీవుడ్ హీరో సుధీర్ బాబు (Sudheer Babu)  సినిమాలు ప్ర‌త్యేకంగా ఉంటాయి. కొత్త త‌ర‌హా క‌థ‌ల‌తో సుధీర్ బాబు ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచుతూ ఉంటారు. ప్ర‌స్తుతం సుధీర్ బాబు న‌టించ‌నున్న కొత్త సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు మేక‌ర్స్. 'హంట్' అనే టైటిల్‌తో చిత్ర యూనిట్ ఓ టీజ‌ర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమా టైటిల్‌తో పాటు టీజ‌ర్ కూడా ఆస‌క్తిక‌రంగా సాగింది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. యాక్ష‌న్ థ్రిల్లర్‌గా 'హంట్' తెర‌కెక్క‌నుంది.

 

సినిమా టైటిల్ రిలీజ్

‘స‌మ్మోహ‌నం’ సినిమా సుధీర్ బాబు  (Sudheer Babu) కు సూప‌ర్ హిట్ ఇచ్చింది. ఆ త‌రువాత‌ ‘వి’, ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ సినిమాలలో సుధీర్ బాబు న‌టించారు. ప్ర‌స్తుతం 'హంట్' సినిమాతో  ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారుయాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీగా 'హంట్' తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాలో సుధీర్ సిక్స్ పాక్ బాడీతో క‌నిపించ‌నున్నారు. ‘హంట్: గ‌న్స్ డోంట్ లై’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ మోష‌న్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

 

బిజీగా సుధీర్ బాబు

సుధీర్ బాబు (Sudheer Babu)  న‌టిస్తున్న 'హంట్' సినిమాకు మ‌హేష్ సూర‌ప‌నేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రాన్ని భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. హీరో శ్రీకాంత్, త‌మిళ న‌టుడు భ‌ర‌త్ కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం స‌మ‌కూర్చ‌నున్నారు. ఈ చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు సుధీర్ న‌టించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలతో పాటు ‘మామా మ‌చ్చింద్రా’, బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపిచంద్ బ‌యోపిక్‌ల‌లో సుధీర్ బాబు న‌టిస్తున్నారు. 

Read More: 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా కోసం.. ద‌ర్శ‌కుడిగా మారిన సుధీర్ బాబు (Sudheer Babu)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!