Rama Rao On Duty: 'రామారావు ఆన్ డ్యూటీ' మాస్ నోటీస్ రిలీజ్.. ర‌వితేజ ( Ravi Teja) మాస్ డైలాగులు కేక‌

Updated on Jul 27, 2022 12:39 PM IST
 'నేను ల‌క్కుల మీద లాట‌రీల మీద డిపెండ్ అయ్యేవాడిని కాదు.. నా వ‌ర్క్ మీద డిపెండ్ అయ్యే వాడిని' అంటూ ర‌వితేజ (Ravi Teja) వార్నింగ్  ఎవ‌రికి?
'నేను ల‌క్కుల మీద లాట‌రీల మీద డిపెండ్ అయ్యేవాడిని కాదు.. నా వ‌ర్క్ మీద డిపెండ్ అయ్యే వాడిని' అంటూ ర‌వితేజ (Ravi Teja) వార్నింగ్  ఎవ‌రికి?

Rama Rao On Duty: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా న‌టించిన 'రామారావు ఆన్ డ్యూటీ' విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో శ‌రత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాన్నిశ్రీ ల‌క్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత‌ సుధాకర్ చెరుకూరి నిర్మించారు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్ అప్‌డేట్ రిలీజ్ అయింది. మాస్ నోటీస్ పేరుతో మేక‌ర్స్  ఓ వీడియోను రిలీజ్ చేశారు. 

మాస్ వీడియో అదుర్స్

రామారావు మాస్ నోటీస్ పేరుతో గ్లింప్స్ వీడియోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ర‌వితేజ (Ravi Teja) మాస్ ఫైట్స్ ఆక‌ట్టుకున్నాయి. 'నువ్వు చెప్పింది వింటే నాకే భ‌యం వేస్తుంది' అని త‌నికెళ్ల భ‌ర‌ణి డైలాగు సినిమాపై ఆస‌క్తి పెంచింది. అలాంటి భ‌య‌ప‌డే సంఘ‌ట‌న ఏం జ‌రిగి ఉంటుంది?. 'నేను ల‌క్కుల మీద లాట‌రీల మీద డిపెండ్ అయ్యేవాడిని కాదు.. నా వ‌ర్క్ మీద డిపెండ్ అయ్యే వాడిని' అంటూ ర‌వితేజ వార్నింగ్  ఎవ‌రికి?.. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొర‌కాలంటే జూలై 29న రిలీజ్ అయ్యే 'రామారావు ఆన్ డ్యూటీ' చూడాల్సిందే. 

వేణు పాత్ర కీల‌క‌మా?.

'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రంలో హీరోయిన్లు రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ న‌టిస్తున్నారు. రవితేజ (Ravi Teja) ఎమ్మార్వోగా ఓ కొత్త పాత్ర‌లో వెండితెర‌పై క‌నిపించ‌నున్నారు. మ‌రో హీరో వేణు తొట్టెంపూడి (Venu Thottempudi)  పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచున్నారు. 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ నుంచి రీసెంట్‌గా విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. ర‌వితేజ‌, వేణుల కాంబోలో వ‌స్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుందో చూడాలి. 

 

ర‌వితేజ మా స్పూర్తి - నాని

'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో నాని ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. తాను వ‌చ్చింది గెస్టుగా కాద‌ని.. ర‌వితేజ గురించి మాట్లాడానికని నాని చెప్పారు. ర‌వితేజ చిరంజీవిని ఎలా స్పూర్తిగా తీసుకున్నారో.. త‌న జ‌న‌రేష‌న్ వాళ్లు ర‌వితేజ‌ను స్పూర్తిగా తీసుకున్నార‌ని తెలిపారు. 'రామారావు ఆన్ డ్యూటీ'పై మొద‌టి నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తుంద‌ని..ఈ సినిమా త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని నాని చెప్పారు.

Read More: Ramarao on duty Trailer: 'రామారావు ఆన్ డ్యూటీ' నుంచి మాస్ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన రవితేజ (Raviteja)..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!