Ramarao on duty Trailer: 'రామారావు ఆన్ డ్యూటీ' నుంచి మాస్ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన రవితేజ (Raviteja)..!

Updated on Jul 16, 2022 08:42 PM IST
 'రామారావు ఆన్ డ్యూటీ' పోస్టర్ (Ramarao on Duty Poster)
 'రామారావు ఆన్ డ్యూటీ' పోస్టర్ (Ramarao on Duty Poster)

Ramarao on duty Trailer: టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ కెరీర్‌లో ఎప్పుడూ లేనంత స్పీడ్‌గా ర‌వితేజ వరుస పెట్టి సినిమాల‌ను చేస్తున్నారు. ఏడాదికి రెండు సినిమాల‌ను విడుద‌ల‌ చేసే విధంగా రవితేజ ప్లాన్ చేస్తున్నారు. ఈ కమ్రంలోనే ఇటీవల 'క్రాక్' సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేశారు. ఆ తర్వాత 'ఖిలాడీ' అంతగా ఆకట్టుకోలేదు. 

రమేష్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన 'ఖిలాడీ' సినిమా మాత్రం రవితేజ ఊహించిన మేర అంచనాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో వరుస సినిమాలను లైన్లో పెట్టిన రవితేజ ఇప్పుడు 'రామారావు ఆన్ డ్యూటీ' (Ramarao on Duty) సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్టు సాధించాల‌ని క‌సితో ఉన్నాడు. ఈ చిత్రంతో శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం జూలై 29న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం వ‌రుస అప్‌డేట్‌ల‌ను ఇస్తోంది. 

 'రామారావు ఆన్ డ్యూటీ' (Ramarao on Duty) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ను శనివారం (జులై 16) ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌ హోటల్‌లో జరిగిన ఈవెంట్‌లో ఆరుగురు టాలీవుడ్ దర్శకులు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో మాస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా రవితేజ యాక్టింగ్, డైలాగ్స్‌తో అదరగొట్టాడు. 

1995 నాటి నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. సామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లగా రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌ (Divyansha Kaushik) నటిస్తున్నారు. అలాగే చాలా రోజుల గ్యాప్‌ తర్వాత ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనున్నాడు నటుడు వేణు తొట్టెంపూడి. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు. 

ఈ ట్రైలర్ గమనిస్తే రవితేజ ఓ క్రైమ్‌ను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. పిల్లలు కిడ్నాప్ అయ్యే ఇన్సిడెంట్‌తోనే సినిమా తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. అయితే ఎమ్మార్వో అయిన రామారావు.. ఈ కిడ్నాప్ కేసుల మీద ఎందుకు ఫోకస్ పెట్టాడు? ఇక సీఐ పాత్రలో వేణు తొట్టెంపూడి (Venu Thottempudi) చేసే పనులు ఏంటి? అనేది ఆసక్తికరంగా మారనుంది. అయితే ఈ ట్రైలర్‌లో వేణుకి అంత ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించడం లేదు. ఒకే ఒక్క డైలాగ్, రెండు మూడు షాట్స్‌లో మాత్రమే ఆయన కనిపించాడు. 

Read More: Mega 154 Update: 'మెగా-మాస్' జాతర మొదలైంది.. చిరంజీవితో షూటింగ్ కు రవితేజ రెడీ.. వీడియో వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!