Ramarao on Duty: నేను న‌టించ‌న‌న్నా ద‌ర్శ‌కుడు విన‌లేదు - హీరో వేణు తొట్టెంపూడి (Venu Thottempudi)

Updated on Jul 07, 2022 11:54 AM IST
Ramarao on Duty: ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండ‌వ కార‌ణంగానే తాను మ‌ళ్లీ న‌టిస్తున్నాని వేణు తెలిపారు.
Ramarao on Duty: ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండ‌వ కార‌ణంగానే తాను మ‌ళ్లీ న‌టిస్తున్నాని వేణు తెలిపారు.

టాలీవుడ్‌లో హీరో వేణు తొట్టెంపూడి  (Venu Thottempudi) 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. స్వ‌యంవ‌రం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టారు వేణు. ఆ త‌ర్వాత ప‌లు కామెడీ సినిమాల్లో న‌టించి మెప్పించారు. ప్ర‌స్తుతం ర‌వితేజ న‌టించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండ‌వ కార‌ణంగానే తాను మ‌ళ్లీ న‌టిస్తున్నాని వేణు తెలిపారు.

న‌టించ‌న‌న్న విన‌లేదు - వేణు (Venu Thottempudi)
Ramarao On Duty: రామారావు ఆన్ డ్యూటీ నుంచి వేణు ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఓ ప‌ప‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో వేణు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. సీఐ మురళి పాత్రలో వేణు వెండితెర‌పై వినోదం పంచ‌నున్నారు. దాదాపు ప‌దేళ్ల పాటు వేణు సినిమాల‌కు దూరంగా ఉన్నారు. సినిమాలంటే త‌న‌కు ఇష్ట‌మున్నా... కొన్ని కార‌ణాల‌తో దూర‌మ‌య్యాన‌ని వేణు తెలిపారు. 

ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండ‌వ రామారావు ఆన్ డ్యూటీలో న‌టించ‌మ‌ని వేణుని అడిగారు. అయితే త‌న‌కు ఎన్నో సార్లు ఫోన్ చేసి అడిగినా.. న‌టించ‌న‌ని చెప్పాన‌ని వేణు అన్నారు. ఎంత చెప్పినా విన‌కుండా ఆ ద‌ర్శ‌కుడు ప‌దే ప‌దే అడుగుతూనే ఉండేవార‌ట‌. సినిమాలో న‌టించ‌కున్నా.. ఓ సారి క‌ల‌వాలంటూ శ‌ర‌త్ మండ‌వా వేణును అడిగార‌ట‌. ఇక శ‌ర‌త్ మండ‌వాను క‌లిశాక‌.. అత‌ను చెప్పిన క‌థ న‌చ్చి వెంట‌నే ఓకే చెప్పానన్నారు వేణు.

ర‌వితేజ అంద‌రినీ ఎన‌ర్జీతో ఉంచుతారు - వేణు
ర‌వితేజ (Ravi Teja) లాంటి హీరోతో రీ ఎంట్రీ ఇవ్వ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని వేణు చెప్పారు. ర‌వితేజ ఓ ప‌వ‌ర్ హౌస్ లాంటి హీరో.. ఎంతో ఎన‌ర్జీతో ఉంటారు. అంతేకాదు సెట్‌లో ఉన్న ప్ర‌తీ ఒక్క‌రినీ ఎన‌ర్జీతో ఉంచడం ర‌వితేజ ప్ర‌త్యేక‌త అంటూ వేణు (Venu Thottempudi) చెప్పుకొచ్చారు. 

రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో ర‌వితేజ ఎమ్మార్వో ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. అవినీతి రాజ‌కీయ నాయ‌కుల భ‌ర‌తం ప‌ట్టే ఆఫీస‌ర్ పాత్ర‌లో రవితేజ్ న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌వితేజ‌తో ఇద్ద‌రు హీరోయిన్స్ ర‌జిషా విజ‌య‌న్‌, దివ్యాంశ కౌశిక్‌లు న‌టిస్తున్నారు. ఎస్ఎల్‌వి సినిమాస్‌, ఆర్‌టీ సినిమా వ‌ర్క్స్ బ్యాన‌ర్స్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీ చిత్రం జూలై 29న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

Read More: Raviteja: వ‌రుసగా యాక్ష‌న్ సినిమాల‌తో అద‌ర‌గొడుతోన్న మాస్ మహరాజ్ ర‌వితేజ‌!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!