Raviteja: ర‌వితేజ కొడితే గాల్లో ఎగ‌రాల్సిందే!..'రామారావు ఆన్ డ్యూటీ' యాక్షన్ మేకింగ్ వీడియో రిలీజ్

Updated on Jul 13, 2022 05:14 PM IST
ర‌వితేజ (Raviteja) 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం రిలీజ్ త‌ర్వాత ప‌లు సినిమాల్లో న‌టించ‌నున్నారు.
ర‌వితేజ (Raviteja) 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం రిలీజ్ త‌ర్వాత ప‌లు సినిమాల్లో న‌టించ‌నున్నారు.

మాస్ మహారాజా రవితేజ (Raviteja) నటిస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ' నుంచి ఓ స్పెష‌ల్ వీడియోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. దర్శకుడు శరత్ మండవ మొద‌టి సారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. ర‌వితేజ యాక్ష‌న్ సీన్స్‌కు సంబంధించిన వీడియోను ఎస్ఎల్వీ సినిమాస్ నిర్మాణ సంస్థ ఇటీవలే సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ వీడియోలో ర‌వితేజ యాక్ష‌న్ చూస్తే అద‌ర‌హో అనాల్సిందే.

ర‌వితేజ మాస్ ఫైటింగ్స్
ర‌వితేజ సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ' పూర్తి యాక్ష‌న్ సినిమాగా విడుద‌ల కానుంది. ఓ గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీస‌ర్ నిజాయితీగా ఉంటే ఏం జ‌రుగుతుంద‌నేది ఈ సినిమా కాన్సెప్ట్. ఈ చిత్రంలోని పలు యాక్షన్ సీన్స్  హైలెట్‌గా ఉండ‌నున్నాయి. అలాగే రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో క‌నిపించ‌నున్నారని టాక్. ఇందులో హీరో రౌడీలను కొడితే, వారు గాల్లోకి ఎగిరే సీన్స్ అదిరిపోయాయి. అలాగే క‌లెక్ట‌ర్ ఆఫీస్ ద‌గ్గ‌ర ఫైట్ సీన్స్, పోలీస్ ఆఫీస‌ర్ వేణుతో క‌లిసి చేసిన సీన్స్ చూస్తే ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ రావాల్సిందే. 

'రామారావు ఆన్ డ్యూటీ'లో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై నిర్మాత‌ సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాజర్, వేణు తొట్టెంపూడి, తనికెళ్ల భరణి, పవిత్ర లోకేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌నున్నారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీత ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

చిరంజీవి సినిమాలో ర‌వితేజ 
ర‌వితేజ (Raviteja) 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం రిలీజ్ త‌ర్వాత ప‌లు సినిమాల్లో న‌టించ‌నున్నారు. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో 'ధమాకా', సుధీర్ వర్మ దర్శకత్వంలో  'రావణాసుర', వంశీ దర్శకత్వంలో 'టైగర్ నాగేశ్వర రావు' చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. అలాగే  మెగాస్టార్ చిరంజీవి, ద‌ర్శ‌కుడు బాబి కాంబో  సినిమా 'మెగా 154'లో కూడా ఓ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు.

Read More: Ramarao on Duty: నేను న‌టించ‌న‌న్నా ద‌ర్శ‌కుడు విన‌లేదు - హీరో వేణు తొట్టెంపూడి (Venu Thottempudi)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!