వంద‌ల కిలో మీట‌ర్ల‌ను న‌డిచేలా చేసిన అభిమానం - రామ్ చ‌రణ్ (Ram Charan) కు ఊహించ‌ని గిఫ్ట్

Updated on May 28, 2022 10:53 PM IST
జై రాజ్ తాను పండించిన పంట రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) ఆకృతిలో వ‌చ్చేలా చేశాడు.
జై రాజ్ తాను పండించిన పంట రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) ఆకృతిలో వ‌చ్చేలా చేశాడు.

రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) కోసం ఓ అభిమాని వంద‌ల కిలోమీట‌ర్లు న‌డిచాడు. అంతే కాదు ! ఎవ‌రూ ఊహించ‌ని గిఫ్ట్‌ను తన అభిమాన నటుడు రామ్ చ‌ర‌ణ్‌కు అందించాడు. అభిమానంతో ఇంత చేశాడా!  అంటూ రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్‌ను చూసి నెటిజ‌న్లు ఆశ్చ‌రపోతున్నారు. గద్వాల్ జిల్లాకు చెందిన జైరాజ్ అనే వ్యక్తికి రామ్‌చరణ్ అంటే ఎంతో అభిమానం. త‌న‌కు వ‌చ్చిన క‌ళ‌తో, త‌న అభిమాని  హీరోకి గిఫ్ట్ ఇవ్వాల‌ని జై రాజ్ నిర్ణ‌యించుకున్నాడు.

వ్య‌వ‌సాయం చేస్తూ జీవ‌నం సాగిస్తున్న జై రాజ్‌కు ఓ రోజు మంచి ఐడియా వ‌చ్చింది. వెంటనే, తాను తీసుకున్న కౌలు పొలంలో రామ్ చ‌ర‌ణ్ చిత్రాన్ని గీశాడు. అందులో వ‌రి పంట పండించాడు. రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు నాడు, వ‌రి పొలంలో చరణ్ చిత్రం వచ్చేలా ఓ స్ట్రక్చర్‌ని రూపొందించాడు. అంటే, తాను పండించిన పంటను రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) ఆకృతిలో వ‌చ్చేలా చేశాడన్న మాట. తర్వాత ఆకృతిని ఫోటో కూడా తీశాడు. 

 

జై రాజ్ తాను పండించిన పంటను రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) ఆకృతిలో వ‌చ్చేలా చేశాడు.

జై రాజ్ తాను పండించిన పంట రామ్ చ‌ర‌ణ్ (Ram Charan)  ఆకృతిలో వ‌చ్చేలా చేశాడు.

అంతే కాదు.. రామ్ చ‌ర‌ణ్‌ చెంతకు తాను పండించిన పంట‌ను తీసుకెళ్లాల‌ని ఫిక్స్ అయ్యాడు జై రాజ్.  గద్వాల్ జిల్లా నుంచి హైదరాబాద్‌కు 264 కిలోమీటర్లు నడిచాడు. చివ‌ర‌కు రామ్ చ‌ర‌ణ్‌ను అత‌ని ఇంట్లో క‌లుసుకున్నాడు. ఇంకేముంది ! రామ్ చ‌ర‌ణ్ జై రాజ్ అభిమానాన్ని చూసి మురిసిపోయాడు. అత‌నితో మాట్లాడాడు. ఫోటోలు కూడా దిగాడు. ప్ర‌స్తుతం జైరాజ్,  చెర్రీల (Ram Charan) ఫోటోలు ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారాయి.
 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!