పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్‌ అప్పుడు కాదట.. మరెప్పుడంటే?

Updated on May 05, 2022 12:29 PM IST
హరిహర వీరమల్లు సినిమా సెట్‌లో ప్రాక్టీస్ చేస్తున్న పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)
హరిహర వీరమల్లు సినిమా సెట్‌లో ప్రాక్టీస్ చేస్తున్న పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సినిమా చేస్తున్నారని ప్రకటిస్తే చాలు. అది రిలీజ్ అయ్యే వరకు, ఆ సినిమా గురించి  ప్రసారమయ్యే ఏ వార్త అయినా సంచలనమే. ఆ సినిమా అప్ డేట్స్ గురించి  ఫ్యాన్స్‌ అంతగా ఎదురుచూస్తారు మరి. ఇక, ఇటీవలే పవన్‌ నటించిన భీమ్లా నాయక్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఫ్యాన్స్‌, పవన్‌ తర్వాతి సినిమా గురించి మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో పవన్‌ ‘హరిహర వీరమల్లు’ అనే సినిమా చేయబోతున్నట్టు ఓ వార్త వచ్చింది.

ఇప్పటికే షూటింగ్‌ కార్యక్రమాలను మొదలుపెట్టిన హరిహర వీరమల్లు చిత్రాన్ని, ఈ ఏడాది దసరాకు విడుదల  చేయాలని నిర్మాతలు భావించారు. దానికి తగ్గట్టుగానే పవన్‌ కూడా సినిమాను వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడని టాక్. అందుకు తగ్గట్టుగా తన డేట్స్‌ను అడ్జస్ట్ చేసుకుంటున్నాడని వినికిడి. .

తాజాగా హరిహర వీరమల్లు సినిమా గురించి మరో  కొత్త అప్‌డేట్‌ బయటికి వచ్చింది. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా, ఈ దసరాకు విడుదల కావడం లేదన్నది సమాచారం. ఏప్రిల్‌ నెల నుంచి రెగ్యులర్‌‌ షూటింగ్‌ జరుపుకుంటుందీ చిత్రం. అయినా సినిమా రిలీజ్‌ వాయిదా పడిందనే, వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

సినిమా షూటింగ్‌తోపాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, తొందరగా చిత్రాన్ని విడుదల చేయాలని భావించింది చిత్ర యూనిట్‌. అయినా ఆఖరి నిముషంలో తమ ప్లాన్‌ మార్చుకుందని సమాచారం. అనుకున్న సమయానికి షెడ్యూల్ ప్రకారం షూటింగ్‌ పూర్తయినప్పటికీ.. వీఎఫ్‌ఎక్స్ పనులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయట.  అందుకే రిలీజ్‌ డేట్స్‌ మార్చినట్టు ఇండస్ట్రీలో టాక్. ఇదే క్రమంలో, ఈ  సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి, చిత్ర యూనిట్ ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమాలో ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

హరిహర వీరమల్లు సినిమాలోని ఇతర కీలకపాత్రల్లో పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ నటిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కెరీర్‌‌లో మొదటి పాన్‌ ఇండియా సినిమాగా హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది. ఈ  సినిమాలో పవన్‌ కల్యాణ్‌ లుక్‌ చూసిన ఫ్యాన్స్‌.. ఈ  సినిమా తప్పకుండా సూపర్ డూపర్ హిట్‌ సాధిస్తుందని ఫిక్స్ అయిపోయారు,

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!