‘రంగ రంగ వైభ‌వంగా’ ట్రైల‌ర్ రిలీజ్.. కొత్త క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న వైష్ణ‌వ్ తేజ్ (Vaisshnav Tej) 

Updated on Aug 23, 2022 07:15 PM IST
పంజా వైష్ణ‌వ్ తేజ్ (Vaisshnav Tej) న‌టించిన‌ మూడ‌వ సినిమా 'రంగ‌ రంగ వైభవంగా' విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.
పంజా వైష్ణ‌వ్ తేజ్ (Vaisshnav Tej) న‌టించిన‌ మూడ‌వ సినిమా 'రంగ‌ రంగ వైభవంగా' విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

Ranga Ranga Vaibhavanga Trailer: టాలీవుడ్‌లోకి 'ఉప్పెన' సినిమాతో హీరోగా ఎంట‌ర్ అయ్యారు పంజా వైష్ణ‌వ్ తేజ్ (Vaisshnav Tej). వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన  'రంగ‌ రంగ వైభవంగా' సినిమా నుంచి మేక‌ర్స్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. గిరీశాయ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమాలో వైష్ణవ్ జోడీగా కేతిక శర్మ జోడిగా న‌టిస్తుంది. 

పంజా వైష్ణ‌వ్ తేజ్ (Vaisshnav Tej) న‌టించిన‌ మూడ‌వ సినిమా 'రంగ‌ రంగ వైభవంగా' విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. 'ఉప్పెన‌'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్.. 'కొండ పొలం' సినిమాతో మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. 'అర్జున్ రెడ్డి' త‌మిళ్‌లో రీమేక్ చేసిన గిరీశాయ ద‌ర్శ‌క‌త్వంలో 'రంగ రంగ వైభ‌వంగా' సినిమా తెర‌కెక్కింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. 

'రంగ‌ రంగ వైభవంగా' చిత్ర ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ల‌వ్, కామెడీ, ఫ‌న్, ఎమోష‌న్స్.. ఇలా అన్ని క‌ల‌గ‌లిసిన ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌ట్రైన్‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. సెప్టెంబ‌ర్ 2 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఆ రోజు ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు కావ‌డం విశేషం. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. ఈ సినిమా నుంచి విడుద‌లైన టీజ‌ర్, పోస్ట‌ర్లు యువ‌త‌ను ఆక‌ర్షించాయి. ఇక ఈ సినిమా వైష్ణ‌వ్ తేజ్‌కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి. 

Read More: Vaisshnav Tej : వైష్ణవ్ తేజ్ సినిమా 'రంగరంగ వైభవంగా' పై భారీ అంచనాలు .. వెరైటీ పోస్టర్ విడుదల !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!