Vaishnav Tej: 'రంగ రంగ వైభవంగా' టీజర్ లాంఛ్ కార్యక్రమంలో సందడి చేసిన వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ!

Published on Jun 28, 2022 09:30 PM IST

టాలీవుడ్ లో 'ఉప్పెన' చిత్రంతో అందరి దృష్టిని బాగా ఆకర్షించిన వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) నటించిన తాజా చిత్రం రంగ రంగ వైభవంగా. ఈ చిత్రానికి డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో వైష్ణవి తేజ్ సరసన కేతికశర్మ (Ketika Sharma) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా బిజీగా ఉన్నారు. ఈ చిత్రం జూలై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అందరిని ఆకట్టుకునేలా ఉంటుందని ఈ సినిమా టీజర్ ని (Rangaranga Vaibhavanga Teaser) చూస్తే మనకి తెలుస్తోంది. టీజర్ లాంఛ్ కార్యక్రమానికి హాజరైన వైష్ణవ్ తేజ్ పై యూట్యూబర్ గలాటా  గీత ప్రశంసలు కురిపించింది. అంతే కాకుండా డైరెక్ట్ గా అతని ఏజ్ గురించి అడిగేసింది. 

దీనికి "నేను సరైన వయసులో పరిశ్రమలోకి వచ్చాననుకుంటున్నా. 25, 26 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చాను. అయినా నేను సినిమాల్లోకి రావాలని అస్సలు అనుకోలేదు. ఇన్‌స్టాలో ఏదో ఫొటో పెడితే అది చూసి బుచ్చిబాబు (Director Buchi Babu) ఓకే చేయడంతో 'ఉప్పెన'లో నటించా. ఆ సినిమా అప్పుడు నా వయసు 25" అని సమాధానమిచ్చాడు.

Read More: Vaishnav Tej: 'రంగ రంగ వైభవంగా' టీజర్ రిలీజ్.. వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ కెమిస్ట్రీ అదుర్స్!