Vaishnav Tej: 'రంగ రంగ వైభవంగా' టీజర్ రిలీజ్.. వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ కెమిస్ట్రీ అదుర్స్!

Updated on Jun 27, 2022 02:49 PM IST
వైష్ణవ్ తేజ్ లుక్స్ లోను.. ఎక్స్ ప్రెషన్స్ లోను అక్కడక్కడా పవన్ (Pawan Kalyan) గుర్తుకు వస్తున్నాడు
వైష్ణవ్ తేజ్ లుక్స్ లోను.. ఎక్స్ ప్రెషన్స్ లోను అక్కడక్కడా పవన్ (Pawan Kalyan) గుర్తుకు వస్తున్నాడు

టాలీవుడ్ లో 'ఉప్పెన' వంటి ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej).. తొలి సినిమాతోనే యూత్ హృదయాలను దోచేసుకున్నాడు. త‌రువాత ఆయన నటించిన ‘కొండ‌పొలం’ ప్రేక్ష‌కుల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. వైష్ణవ్ ప్రస్తుతం 'రంగ రంగ వైభవంగా' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అప్పుడే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. 

‘అర్జున్ రెడ్డి’ త‌మిళ వెర్ష‌న్ ‘ఆదిత్య వ‌ర్మ’ సినిమాను డైరెక్ట్ చేసిన గిరీశ‌య్య ఈ చిత్రానికి కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌లో బిజీగా ఉంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం త‌ర‌చూ ఒక అప్‌డేట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తుంది. తాజాగా మేక‌ర్స్ టీజ‌ర్‌ను (Rangaranga Vaibhavanga Teaser) విడుద‌ల చేశారు.

'నన్నే చూస్తావ్. నా గురించే కలలు కంటావ్. నన్నే ప్రేమిస్తావ్. కానీ, నీకు నాతో మాట్లాడటానికి ఇగో' అని హీరోయిన్ కేతికా శర్మ చెప్పే డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అయ్యింది. ఆమె డైలాగ్ వినిపిస్తుంటే... స్క్రీన్ మీద హీరో హీరోయిన్లు ఇద్దరూ పరిచయం అయ్యారు. సినిమా కథ ఏంటి? అనేది టీజ‌ర్‌లో చెప్పేశారు. హీరో హీరోయిన్లు ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఇష్టం. అయితే... ఇద్దరి మధ్య మాటల్లేవ్.

అయితే హీరోయిన్ ప్రాబ్లమ్‌లో ఉందని తెలిస్తే మాత్రం, హీరో వెంటనే వచ్చి ఫైట్ చేస్తాడు. అలాగే ఇద్దరూ ఒక్కటే బైక్ మీద కాలేజీకి వస్తారు. 'కలిసిపోయారా?' అని ఫ్రెండ్ అడిగితే... ఆటోలో వస్తే ఆటో వాడితో కలిసిపోయినట్టా? అని హీరోయిన్ ప్రశ్నిస్తుంది. 'మానవత్వం చచ్చిపోయింది భయ్యా' అని వైష్ణవ్ తేజ్ చెప్పే డైలాగ్, 'ఒరేయ్ బామ్మర్ది' అంటూ ఆలీ (Comedian Ali) అనడం బావుంది. మధ్యలో హీరోయిన్ నాభి చూడాలని, హీరో ప్రయత్నించే సన్నివేశం కూడా. ఇవన్నీ కలగలిపి 'రంగ రంగ వైభవంగా' టీజర్ ఆకట్టుకునేలా ఉంది. 

లవ్.. రొమాన్స్.. యాక్షన్‌కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. టీజర్‌ను బట్టి ఇది యూత్‌కి బాగానే కనెక్ట్ అవుతుందనిపిస్తోంది. వైష్ణవ్ తేజ్ లుక్స్‌లోనూ.. ఎక్స్ ప్రెషన్స్‌లోనూ అక్కడక్కడా పవన్ (Pawan Kalyan) గుర్తుకు వస్తున్నాడు. ఇక ఈ సినిమాతో రొమాంటిక్ లుక్స్ పరంగా కేతిక మరిన్ని మార్కులను సంపాదించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. 

ఈ సినిమాలో దేవీ శ్రీ ప్ర‌సాద్ నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. టీజ‌ర్‌లోనే ఇంత ఎంట‌ర్టైన్‌మెంట్ ఉంటే, సినిమాలో ఇక ఏ లెవ‌ల్లో ఉంటుందో అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

కేతిక శ‌ర్మ (Ketika Sharma) హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో మంచి అంచ‌నాలే ఉన్నాయి. చిత్రం నుండి విడుద‌లైన ‘కొత్త‌గా లేదెంటో’ పాట‌ యూట్యూబ్‌లో మిలియ‌న్ల వ్యూస్‌ వైపు దూసుకుపోతోంది. శ్రీ వెంక‌టేశ్వ‌రా సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా  ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More: Vaisshnav Tej : వైష్ణవ్ తేజ్ సినిమా 'రంగరంగ వైభవంగా' పై భారీ అంచనాలు .. వెరైటీ పోస్టర్ విడుదల !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!