Vaisshnav Tej : వైష్ణవ్ తేజ్ సినిమా 'రంగరంగ వైభవంగా' పై భారీ అంచనాలు .. వెరైటీ పోస్టర్ విడుదల !

Updated on Jun 25, 2022 08:46 AM IST
బుచ్చి బాబు సనా డైరెక్షన్‌లో తెరకెక్కిన ఉప్పెన సినిమా ఊహించని విజయం సాధించింది. ఈ చిత్రంలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej). 
బుచ్చి బాబు సనా డైరెక్షన్‌లో తెరకెక్కిన ఉప్పెన సినిమా ఊహించని విజయం సాధించింది. ఈ చిత్రంలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej). 

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej) అందరికీ సుపరిచితుడు. మొదటిసారిగా 'ఉప్పెన'చిత్రంతో ఈయన తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. బుచ్చి బాబు సనా డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని విజయం సాధించింది. ఈ చిత్రంలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej). 

ఇదే హీరో క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో నటించిన 'కొండపొలం' చిత్రం కూడా ఓ మాదిరి ఫర్వాలేదనిపించింది. పెద్ద కలెక్షన్లు నమోదు చేయకపోయినా, మంచి చిత్రంగా నిలిచింది. తెలుగు రచయిత సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.

కథానాయికగా కేతిక శర్మ

ప్రస్తుతం పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej) తాజాగా మరో చిత్రంలో కూడా నటిస్తున్నారు. 'రంగరంగ వైభవంగా' పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. కేతిక శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

 

గిరీశాయ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి  దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించడం విశేషం. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లను చిత్ర యూనిట్ విడుదల చేసింది. త్వరలో మరో టీజర్‌ని కూడా విడుదల చేయనుంది. 

సినిమాపై భారీ అంచనాలు

ఇటీవలే ఈ సినిమా నిర్మాతలు కాస్త వెరైటీగా ఆలోచించారు. హీరో పంజా వైష్ణవ్ తేజ్ లుక్‌కు సంబంధించి సగం పోస్టర్‌ని రిలీజ్ చేశారు. మిగతా సగం పోస్టర్‌ను చూడాలంటే, త్వరలోనే కథానాయిక కేతిక శర్మ సోషల్ మీడియా పేజీలను వీక్షించండి అంటూ పోస్ట్ చేశారు.

యాక్షన్ ఓరియంటెడ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తప్పకుండా  వైష్ణవ్ తేజ్ కెరీర్‌కు ప్లస్ అవుతుందని, అలానే దర్శకుడు గిరీశాయ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారని అంటున్నారు నిర్మాతలు.

Read More: హైదరాబాద్ జిమ్ వద్ద హీరో వైష్ణవ్ తేజ్‌తో ముచ్చట్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!