‘లాల్ సింగ్ చ‌డ్డా’ స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్..నాగ‌చైత‌న్య (Naga Chaitanya) ఫ‌న్నీ డైలాగులు అదుర్స్

Updated on Aug 07, 2022 06:56 PM IST
స్నేహితుల దినోత్స‌వం సంద‌ర్భంగా  'లాల్ సింగ్ చ‌డ్డా' నుంచి ఆమిర్ ఖాన్, నాగ‌చైత‌న్య‌ (Naga Chaitanya) ల పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.
స్నేహితుల దినోత్స‌వం సంద‌ర్భంగా 'లాల్ సింగ్ చ‌డ్డా' నుంచి ఆమిర్ ఖాన్, నాగ‌చైత‌న్య‌ (Naga Chaitanya) ల పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

Lal Singh Chaddha: టాలీవుడ్ న‌టుడు నాగ‌చైత‌న్య (Naga Chaitanya) న‌టించిన 'లాల్ సింగ్ చ‌డ్డా' నుంచి మేక‌ర్స్ స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. స్నేహితుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఆమిర్ ఖాన్, నాగ‌చైత‌న్య‌ల పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఆ పోస్ట‌ర్‌లో ‘నేను బ‌నియ‌న్, నువ్వు చడ్డీలా’ హ్యాష్ ట్యాగ్ కూడా జ‌త చేశారు. ఈ పోస్ట‌ర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

ఫ్రెండ్స్ పోస్ట‌ర్ రిలీజ్ 

హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా 'లాల్ సింగ్ చ‌డ్డా'ను అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కించారు. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్, నాగ‌చైత‌న్య‌ (Naga Chaitanya)లు ఆర్మీ అధికారులుగా క‌నిపించ‌నున్నారు. ‘మ‌న‌మిద్ద‌రం ఎప్పుడూ క‌లిసే ఉంటాం. నేను బ‌నియ‌న్, నువ్వు చ‌డ్డీలా’ అనే కాప్ష‌న్ ఉన్న‌ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. నాగ‌చైత‌న్య‌, ఆమిర్ ఖాన్ ఆర్మీ ట్రైనింగ్‌లో తాడుపై వేలాడుతూ ఒక‌రినొక‌రు చూసుకుంటున్నారు. ఆ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. 

'థ్యాంక్యూ' సినిమా త‌ర్వాత హీరో నాగ‌చైత‌న్య (Naga Chaitanya) న‌టించిన‌ 'లాల్ సింగ్ చ‌డ్డా' విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో నాగ‌చైత‌న్య బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. 'లాల్ సింగ్ చ‌డ్డా'లో నాగ‌చైత‌న్య బాల‌రాజు పాత్ర‌లో న‌టించారు. ఆ పాత్ర‌కు సంబంధించిన విశేషాల‌తో ఓ వీడియోను మేక‌ర్స్  రీసెంట్‌గా రిలీజ్ చేశారు. 'లాల్ సింగ్ చ‌డ్డా'లో నాగ‌చైత‌న్య త‌న తాత అక్కినేని నాగేశ్వ‌ర‌రావు బాల‌రాజు సినిమాలో ఉన్న‌ లుక్‌లో క‌నిపించ‌నున్నారు. 

చిరు స‌మ‌ర్ఫ‌ణ‌లో రిలీజ్

చిరంజీవి స‌మ‌ర్ప‌ణ‌లో 'లాల్ సింగ్ చ‌డ్డా' సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. ‘రుద్ర‌వీణ‌’, ‘త్రినేత్రుడు’ త‌ర్వాత చిరు నాగ‌చైత‌న్య‌, అమీర్‌ఖాన్‌ల సినిమాను స‌మ‌ర్పించ‌డం విశేషం. 'లాల్ సింగ్ చ‌డ్డా' హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఆగ‌స్టు 11న‌ రిలీజ్ కానుంది. వ‌యాకామ్ 18 స్టూడీయోస్‌తో క‌లిసి అమీర్‌ఖాన్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read More: Aamir Khan & Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కోసం అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' (Laal Singh Chaddha) ప్రివ్యూ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!