వారిద్దరి బంధం ‘ముద్దపప్పు ఆవకాయ’ .. ‘లాల్‌సింగ్ చద్దా’లో కరీనా ఫస్ట్‌ లుక్‌పై చిరంజీవి (Chiranjeevi) ట్వీట్ !

Updated on Jul 19, 2022 02:04 PM IST
అమీర్‌‌ఖాన్, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)
అమీర్‌‌ఖాన్, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)

వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంటున్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). అయినప్పటికీ బాలీవుడ్‌ స్టార్లను కలిసి కలిసి సందడి చేస్తున్నారు. అద్వైత్ చంద‌న్ డైరెక్షన్‌లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ న‌టిస్తోన్న చిత్రం ‘లాల్ సింగ్ చద్దా (Laal Singh Chaddha)‘. అమీర్ ఖాన్ ప్రొడ‌క్షన్స్, వ‌యాకామ్ 18 పిక్చర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అమీర్ ఖాన్, నాగచైతన్య ఈ చిత్రంలో స్నేహితులుగా నటిస్తున్నారు.

కాగా ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మేక‌ర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. హీరోయిన్ క‌రీనా క‌పూర్ పోషిస్తున్న రూప పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ అప్‌డేట్‌ను చిరు ట్విట‌ర్ ద్వారా షేర్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేసిన ట్వీట్

లాల్ సింగ్ చద్దా ప్రేయసి ‘రూప’ని మీకు పరిచయం చేస్తున్నాను. వీళ్లిద్దరి బంధం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ముద్దపప్పు- ఆవకాయ’ అని ట్వీట్ చేశారు చిరంజీవి. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇప్పటికే చిరంజీవి కోసం హైద‌రాబాద్‌లోని ఆయ‌న ఇంట్లో అమీర్‌ఖాన్  'లాల్ సింగ్ చద్దా' (Laal Singh Chaddha) చిత్రాన్ని స్పెష‌ల్ షో వేసిన విష‌యం తెలిసిందే.

చిరంజీవి (Chiranjeevi) ఇంట్లో ఏర్పాటు చేసిన ఈ షోకు అమీర్‌తో పాటు అక్కినేని నాగార్జున‌, నాగ‌చైత‌న్య, సుకుమార్‌, రాజ‌మౌళి మొదలైన తెలుగు సినీ ప్రముఖులు హాజ‌ర‌య్యారు. ఈ సినిమా ఆగ‌స్టు 11వ తేదీన థియేట‌ర్లలో విడుద‌ల కాబోతోంది. హాలీవుడ్ కామెడీ డ్రామా ‘ఫారెస్ట్‌ గంప్‌‘కు రీమేక్‌గా వ‌స్తుంది ‘లాల్ సింగ్ చ‌ద్ధా‘. ఈ ప్రాజెక్టుతో నాగ‌చైత‌న్య  బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.

Read More : కష్టపడి పనిచేస్తున్నా.. అందుకే అవకాశాలు వస్తున్నాయి : కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!