Laal Singh Chaddha: 'లాల్ సింగ్ చడ్డా' ప్రియురాలిని ప‌రిచ‌యం చేసిన చిరంజీవి (Chiranjeevi)

Updated on Jul 20, 2022 05:20 PM IST
చిరంజీవి (Chiranjeevi) త‌న సోష‌ల్ మీడియాలో 'లాల్ సింగ్ చ‌డ్డా'లో హీరోయిన్‌గా న‌టించిన క‌రీనా క‌పూర్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. 
చిరంజీవి (Chiranjeevi) త‌న సోష‌ల్ మీడియాలో 'లాల్ సింగ్ చ‌డ్డా'లో హీరోయిన్‌గా న‌టించిన క‌రీనా క‌పూర్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. 

Laal Singh Chaddha: బాలీవుడ్ న‌టుడు అమీర్‌ఖాన్ న‌టించిన 'లాల్ సింగ్ చ‌డ్డా' విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తెలుగులోనూ విడుద‌ల కానుంది. అక్కినేని నాగ‌చైత‌న్య 'లాల్ సింగ్ చ‌డ్డా'లో ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్ర ప్ర‌మోష‌న్ల‌ను మేక‌ర్స్ డిఫరెంట్‌గా చేస్తున్నారు. చిరంజీవితో హీరోయిన్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయించారు. చిరంజీవి (Chiranjeevi) త‌న సోష‌ల్ మీడియాలో 'లాల్ సింగ్ చ‌డ్డా'లో హీరోయిన్‌గా న‌టించిన క‌రీనా క‌పూర్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. 

కీల‌కంగా  నాగ చైత‌న్య పాత్ర
హాలీవుడ్ సినిమా 'ఫారెస్ట్‌ గంప్' ను హిందీలో 'లాల్ సింగ్ చ‌డ్డా'గా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో అమీర్ ఖాన్‌, క‌రీనా క‌పూర్‌లు హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు వ‌ర్ష‌న్‌ను చిరంజీవి (Chiranjeevi) సమర్పణలో రిలీజ్‌ చేయనున్నట్లు ఇటీవల మేక‌ర్స్‌ ప్రకటించారు. 'లాల్ సింగ్ చ‌డ్డా'లో నాగ చైత‌న్య ఓ సైనికుడి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ పాత్ర‌తో నాగ చైత‌న్య‌కు బాలీవుడ్‌లో మంచి గుర్తింపు వ‌స్తుంద‌ని క్రిటిక్స్ అంటున్నారు.

క‌రీనా లుక్ అదుర్స్
బాలీవుడ్ దివా కరీనా కపూర్ 'లాల్ సింగ్ చ‌డ్డా'లో రూప పాత్ర‌లో న‌టిస్తున్నారు. క‌రీనా క‌పూర్ పోస్ట‌ర్‌ను చిరంజీవి త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ''‘లాల్ సింగ్ చడ్డా’ ప్రేయసి ‘రూప’ని  మీకు పరిచయం చేస్తున్నాను.. వీళ్లిద్దరి బంధం గురించి ఒక్క  మాటలో చెప్పాలంటే ‘ముద్దపప్పు-ఆవకాయ’'' అని తెలిపారు.

ప్ర‌స్తుతం క‌రీనా క‌పూర్ పోస్ట‌ర్‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. లాల్ సింగ్ చ‌డ్డా హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ కానుంది. వ‌యాకామ్ 18 స్టూడీయోస్‌తో క‌లిసి అమీర్‌ఖాన్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మించాడు.

 

చిరు (Chiranjeevi) ఇంట్లో ప్రివ్యూ
'లాల్ సింగ్ చ‌డ్డా' (Laal Singh Chaddha) చిత్ర ప్రివ్యూను చిరంజీవి ఇంట్లో ప్ర‌ద‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్రివ్యూ షోను అమీర్‌ఖాన్‌తో కలిసి చిరంజీవి, నాగార్జున‌, రాజ‌మౌళి, సుకుమార్‌, నాగ చైత‌న్య వీక్షించారు. చాలా రోజుల క్రితం జ‌పాన్‌లోని టోక్యో ఏయిర్‌పోర్ట్‌లో అమీర్‌ఖాన్‌ను క‌లిసాన‌ని.. అప్పుడు జ‌రిగిన సంభాష‌ణ‌ల మ‌ధ్య అమీర్ త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ 'లాల్ సింగ్ చ‌డ్డా' గురించి చెప్పార‌న్నారు చిరంజీవి. అమీర్ ఖాన్ సినిమాలో త‌న‌ను భాగ‌స్వామ్యం చేసినందుకు సంతోషంగా ఉంద‌ని చిరంజీవి (Chiranjeevi)  తెలిపారు. 

Read More: Aamir Khan & Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కోసం అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' (Laal Singh Chaddha) ప్రివ్యూ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!