Aamir Khan & Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కోసం అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' (Laal Singh Chaddha) ప్రివ్యూ !

Updated on Jul 15, 2022 03:53 PM IST
'లాల్ సింగ్ చద్దా' పోస్టర్, చిరంజీవి, అమీర్ ఖాన్ (Laal Singh Chaddha Poster, Chiranjeevi, Aamir Khan)
'లాల్ సింగ్ చద్దా' పోస్టర్, చిరంజీవి, అమీర్ ఖాన్ (Laal Singh Chaddha Poster, Chiranjeevi, Aamir Khan)

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌ల మధ్య ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. ఎప్పటి నుంచో వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అమీర్ ఖాన్ హీరోగా న‌టించిన‌ తాజా చిత్రం 'లాల్ సింగ్ చద్దా' (Laal Singh Chaddha). ఇటీవలి కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన భారతీయ చిత్రాలలో ఇది కూడా ఒకటి. 

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అద్వైత్ చందన్ దర్శకత్వంలో 'అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్' మ‌రియు 'వయాకామ్ 18 స్టూడియోస్' సంయుక్తంగా నిర్మించిన ‘లాల్ సింగ్ చద్దా’ అనేక వాయిదాల అనంతరం, ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమ‌యింది. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, ఓ ప్రత్యేక పాత్రలో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) నటించారు. 

ఇప్పటికే విడుదలైన 'లాల్ సింగ్ చద్దా' ట్రైలర్‌తో పాటు టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో, ప్రమోషన్స్‌ను షురూ చేశారు నిర్మాతలు. తాజాగా తన చిరకాల మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కోసం 'లాల్ సింగ్ చద్దా' ప్రివ్యూ షోని ఏర్పాటు చేశారు అమీర్ ఖాన్.  

టాలీవుడ్ ప్రముఖుల కోసం తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన 'లాల్ సింగ్ చద్దా' (Laal Singh Chaddha Special Preview) ప్రత్యేక ప్రివ్యూను హైదారాబాద్‌లో ప్రదర్శించారు అమీర్. ఈ ప్రివ్యూకి రాజమౌళి, నాగార్జున, సుకుమార్, చిరంజీవి,  నాగ చైతన్యతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే ఫస్ట్ షో కావడం గమనార్హం. 

కాగా, 'లాల్ సింగ్ చద్దా' ప్రత్యేక ప్రివ్యూకి మెగాస్టార్‌తో పాటు హాజరైన అతిథులంతా, ఈ సినిమా ప‌ట్ల ఎంతో సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ఈ ప్రివ్యూకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలుస్తాయి. హాలీవుడ్‌లో విజయవంతమైన 'ఫారెస్ట్ గంప్' (Forest Gump Remake) చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాని తెరకెక్కించారు.

త్వరలోనే 'లాల్ సింగ్ చద్దా ' సినిమా ప్రమోషన్స్‌ని తెలుగు రాష్ట్రాలలో షురూ చేయనున్నారు. ఈ సినిమాలో తెలుగు నటుడు నాగ చైతన్య కూడా నటించడంతో,  చిత్ర ప్రమోషన్స్ కోసం నాగార్జున, చిరంజీవి, రాజమౌళి.. ఇలా ముఖ్యమైన టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా తరలి రానున్నారు. మరి, ఈ సినిమాతో అమీర్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి 

Read More: Megastar Chiranjeevi: బాలకృష్ణ, నాగార్జున బాటలో మెగాస్టార్ చిరంజీవి.. ఆందోళనలో ఫ్యాన్స్.. కారణమేంటంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!