సినీ కార్మికుల కోసం చిరంజీవి (Chiranjeevi) ముంద‌డుగు.. తండ్రి పేరుతో హాస్పిట‌ల్ నిర్మించనున్న మెగా హీరో

Updated on Aug 20, 2022 03:47 PM IST
హైద‌రాబాద్‌లోని చిత్ర‌పురి కాల‌నీలో సినీ కార్మికుల కోసం సీనియ‌ర్ హీరో చిరంజీవి (Chiranjeevi) ఆస్ప‌త్రి నిర్మించ‌నున్నారు.
హైద‌రాబాద్‌లోని చిత్ర‌పురి కాల‌నీలో సినీ కార్మికుల కోసం సీనియ‌ర్ హీరో చిరంజీవి (Chiranjeevi) ఆస్ప‌త్రి నిర్మించ‌నున్నారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినీ కార్మికుల కోసం కీల‌క ప్ర‌క‌టన చేశారు. హైద‌రాబాద్‌లో సినీ కార్మికుల కోసం ఓ హాస్పిట‌ల్ నిర్మిస్తాన‌ని చిరంజీవి మాట ఇచ్చారు. హైద‌రాబాద్‌లో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చిరంజీవి ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ఎన్ని కోట్లు ఖ‌ర్చు అయినా ఆస్ప‌త్రి నిర్మాణం పూర్తి చేస్తాన‌ని చిరంజీవి అన్నారు. చిరంజీవి ప్ర‌క‌ట‌న‌పై సినీ కార్మికుల‌తో పాటు అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 

తండ్రి పేరుతో సినీ కార్మికుల‌కు హాస్పిట‌ల్ - చిరు

హైద‌రాబాద్‌లోని చిత్ర‌పురి కాల‌నీలో సినీ కార్మికుల కోసం చిరంజీవి (Chiranjeevi) ఆస్ప‌త్రి నిర్మించ‌నున్నారు. ఈ విష‌యాన్ని చిరంజీవి స్వ‌యంగా వెల్ల‌డించారు. 'సెల‌బ్రిటి క్రికెట్ కార్నివాల్' జెర్సీ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చిరంజీవి.. సినీ కార్మికుల కోసం ఆస్ప‌త్రి నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు. త‌న తండ్రి పేరుతో ఓ ఆస్ప‌త్రిని క‌ట్టిస్తాన‌ని చెప్పారు.

సినీ వ‌ర్క‌ర్స్‌, డైలీ వేజ్ కార్మికుల కోసం ఈ ఆస్ప‌త్రిని నిర్మించ‌నున్నారు. చిరంజీవి పుట్టిన‌రోజున హాస్పిట‌ల్ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఎన్ని కోట్లు ఖ‌ర్చు అయినా తానే ఆస్ప‌త్రి నిర్మాణం పూర్తి చేస్తాన‌ని చిరంజీవి తెలిపారు. చిరు ప్ర‌క‌ట‌న‌తో సినీ కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. 

ప‌లు సినిమాల్లో న‌టిస్తున్న‌ చిరు

'ఆచార్య' డిజాస్ట‌ర్ త‌రువాత చిరంజీవి (Chiranjeevi) ప‌లు సినిమాల్లో న‌టిస్తున్నారు. మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో ‘గాడ్‌ఫాద‌ర్’ చిత్రంలో చిరంజీవి న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివ‌రిద‌శ‌లో ఉంది. 'గాడ్‌ఫాద‌ర్' సినిమా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు చిరంజీవి బాబి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న 'వాల్తేరు వీర‌య్య‌', మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో ‘భోళా శంక‌ర్’ చిత్రాల‌లో న‌టిస్తున్నారు. 

Read More: Chiranjeevi : చిరంజీవి నటిస్తున్న 'గాడ్ ఫాదర్' చిత్రంపై కొత్త అప్డేట్.. ఫ్యాన్స్‌కు ఇక పండగే !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!