Chiranjeevi : కృష్ణా జిల్లాలోని చిరంజీవి అభిమానికి క్యాన్సర్ .. అండగా నిలిచిన మెగాస్టార్ !

Updated on Aug 17, 2022 12:55 PM IST
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సేవా తత్పరతకు పెట్టింది పేరు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పేరిట గతంలో ఆయన ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహించారు.
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సేవా తత్పరతకు పెట్టింది పేరు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పేరిట గతంలో ఆయన ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహించారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన వీరాభిమానికి అండగా నిలిచారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన మెగా అభిమాని దొండపాటి చక్రధర్ ఇటీవలే క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి ఆయనకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు, హైదరాబాద్‌కు రప్పించారు. 

కుటుంబానికి భరోసా

స్థానిక ఒమేగా ఆసుపత్రిలో చక్రధర్‌కు చికిత్స ఇప్పించిన మెగాస్టార్, తన అభిమానికి ఎంతో మనోధైర్యాన్ని అందించారు. ఆసుపత్రిలో తనతో ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు. 

చక్రధర్ కుటుంబానికి భరోసా ఇచ్చారు.  ఎప్పటికప్పుడు ట్రీట్‌మెంట్ పురోగతిని గురించి తనకు తెలియజేయాలని వైద్యులకు తెలిపారు.  తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) ఈ సందర్భంగా చక్రధర్ కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్నారు. 

తన అభిమాన కథానాయకుడు తనను చూడటానికి రావడం తన అదృష్టమని చక్రధర్ పేర్కొన్నారు. చక్రధర్ సైతం గతంలో చిరంజీవి ప్రేరణతో కృష్ణా జిల్లాలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. 

సేవలోనూ మెగాస్టార్ 

హీరో చిరంజీవి (Chiranjeevi) టాలీవుడ్ కథానాయకులలో సేవ తత్పరతకు పెట్టింది పేరు. గతంలో కూడా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎందరికో రక్తదానం చేశారు. 

అలాగే, కరోనా విపత్తు సంభవించినప్పుడు కూడా, చిత్రపురిలోని సినీ కార్మికులకు అండగా నిలిచారు. ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా సరఫరా చేశారు.

చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ అనే మూడు చిత్రాలలో నటిస్తున్నారు.అలాగే అమీర్ ఖాన్ హీరోగా, నాగచైతన్య ప్రత్యేక పాత్రలో నటించిన 'లాల్ సింగ్ చడ్డా' తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు సమర్పకుడిగా కూడా వ్యవహరించారు. ఈ సినిమా ఇటీవలే రిలీజైంది.

Read More: సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ వరకు : చిరంజీవి (Chiranjeevi) నటించిన టాప్ 10 సినిమాలు.. ఫ్యాన్స్‌కు ప్రత్యేకం !

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!