Chiranjeevi : చిరంజీవి నటిస్తున్న 'గాడ్ ఫాదర్' చిత్రంపై కొత్త అప్డేట్.. ఫ్యాన్స్‌కు ఇక పండగే !

Updated on Aug 18, 2022 01:29 PM IST
Chiranjeevi : చిరంజీవి నటిస్తున్న 'గాడ్ ఫాదర్' పై పరిశ్రమలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్బీ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Chiranjeevi : చిరంజీవి నటిస్తున్న 'గాడ్ ఫాదర్' పై పరిశ్రమలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్బీ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).. తెలుగు రాష్ట్రాలలో ఆయనకు ఉన్న అభిమానుల సంఖ్య అపారం. చిరు సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. ఆయన ఫ్యాన్స్‌కు అది ఓ పండగ రోజే. ప్రస్తుతం చిరంజీవి మూడు సినిమాలలో నటిస్తున్నారు. గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాలకు ఆయన సైన్ చేశారు. 

తాజాగా చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న 'గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా టీజర్‌ను చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) కు ఒక రోజు ముందే.. అనగా ఆగస్టు 21 తేదిన నిర్మాతలు విడుదల చేస్తున్నారట. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ కూడా ట్వీట్ చేశారు. 

దర్శకుడిగా మోహన్ రాజా

ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న 'గాడ్ ఫాదర్' సినిమాకి మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ రాజా గతంలో రామ్ చరణ్‌తో 'ధృవ' చిత్రాన్ని తెరకెక్కించారు. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన 'లూసిఫర్' సినిమా ఆధారంగా 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

సల్మాన్ ఖాన్‌కు ప్రత్యేక పాత్ర

'గాడ్ ఫాదర్' చిత్రంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిరు, సల్మాన్‌ల మధ్య రూపొందించిన సన్నివేశాలు చాలా పవర్ ఫుల్‌గా ఉంటాయని టాక్. అలాగే ఇదే చిత్రంలో నటి నయనతార చిరంజీవికి సోదరి పాత్రలో నటిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. 

చిరంజీవి (Chiranjeevi) ఇటీవలే బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా' సినిమా తెలుగు వెర్షన్‌కు సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా తెలుగులో పెద్ద ప్రభావం ఏమీ చూపించలేదు. అలాగే హిందీలో కూడా యావరేజ్ కలెక్షన్లతోనే నెగ్గుకొస్తోంది. నాగచైతన్య ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించారు. 

Read More:  Megastar Chiranjeevi: బాలకృష్ణ, నాగార్జున బాటలో మెగాస్టార్ చిరంజీవి.. ఆందోళనలో ఫ్యాన్స్.. కారణమేంటంటే?

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!