చిరంజీవి (Chiranjeevi) డ్రీమ్ రోల్‌ను త‌మ్ముడు చేస్తున్నారా?.. కొత్త గెట‌ప్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్

Updated on Aug 23, 2022 10:59 AM IST
టాలీవుడ్‌లో మొద‌ట్లో సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్న చిరంజీవి (Chiranjeevi).. సూప‌ర్ హిట్‌లు సాధించి మెగా స్టార్‌గా గుర్తింపు పొందారు.
టాలీవుడ్‌లో మొద‌ట్లో సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్న చిరంజీవి (Chiranjeevi).. సూప‌ర్ హిట్‌లు సాధించి మెగా స్టార్‌గా గుర్తింపు పొందారు.

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) న‌ట‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఎన్నో ఏళ్ల‌గా త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం అందిస్తున్నారు చిరు. టాలీవుడ్‌లో మొద‌ట్లో సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్న చిరంజీవి.. ఆ త‌రువాత సూప‌ర్ హిట్‌లు సాధించి మెగా స్టార్‌గా గుర్తింపు పొందారు. 'మ‌ర‌ణ మృదంగం' సినిమాతో చిరంజీవి స్టార్ డ‌మ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. ఎన్నో వంద‌ల పాత్ర‌ల్లో న‌టించిన చిరంజీవికి ఒక్క పాత్ర చేయ‌లేద‌నే అసంతృప్తి ఉంద‌ట‌. 

ఆ పాత్ర‌లో న‌టించాల‌ని ఉంది - చిరు

చిరంజీవి (Chiranjeevi) దాదాపు 150 చిత్రాల్లో న‌టించారు. టాలెంట్‌తో ఉన్న‌త శిఖ‌రాల‌ను చేరుకున్నారు. చిన్న పాత్ర‌ల‌తో సినిమా జీవితం ప్రారంభించారు. న‌ట‌న‌తో పాటు డాన్సులు, ఫైట్స్‌, కామెడీ పండించి అగ్ర క‌థానాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో పాత్ర‌ల్లో న‌టించి చిరంజీవి.. త‌నుకు న‌చ్చిన పాత్ర చేయ‌లేక‌పోయార‌ట‌. భ‌గ‌త్ సింగ్ పాత్ర‌లో న‌టించాల‌ని ఉంద‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ పాత్ర‌లో న‌టించ‌లేక‌పోయాన‌ని చిరంజీవి ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.  భ‌గ‌త్ సింగ్ లాంటి పాత్ర చేసే అవ‌కాశం రాలేద‌ని.. వ‌స్తే క‌చ్చితంగా చేస్తాన‌ని చిరు అన్నారు.

టాలీవుడ్‌లో మొద‌ట్లో సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్న చిరంజీవి (Chiranjeevi).. సూప‌ర్ హిట్‌లు సాధించి మెగా స్టార్‌గా గుర్తింపు పొందారు.

చిరు స్టైలే వేరు - ఫ్యాన్స్

చిరంజీవి (Chiranjeevi) త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ అనే టైటిల్ సినిమాలో న‌టిస్తున్నారు. అన్న‌య్య న‌టించాల‌నుకున్న పాత్ర‌లో త‌మ్ముడు న‌టిస్తున్నారా?. చిరంజీవి తాను అనుకున్న భ‌గ‌త్ సింగ్ పాత్ర‌లో న‌టిస్తారో లేదో చూడాలి. అయితే చిరంజీవి పుట్టిన రోజున కొత్త సినిమాల అప్‌డేట్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నాయి. 'భోళాశంక‌ర్' పోస్ట‌ర్, 'గాడ్‌ఫాద‌ర్' టీజ‌ర్ ఓ రేంజ్‌లో దూసుకెళుతున్నాయి. కొత్త సినిమాల్లో చిరంజీవి స్టైలిష్ లుక్స్ అదుర్స్ అంటూ అభిమానులు అంటున్నారు.

Read More: Godfather Teaser: దుమ్ము రేపుతున్న 'గాడ్ ఫాదర్' టీజర్.. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు పూనకాలే!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!