Godfather Teaser: దుమ్ము రేపుతున్న 'గాడ్ ఫాదర్' టీజర్.. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు పూనకాలే!

Updated on Aug 21, 2022 10:24 PM IST
'గాడ్ ఫాదర్' మూవీ టీజర్ పోస్టర్ (Godfather Teaser Poster)
'గాడ్ ఫాదర్' మూవీ టీజర్ పోస్టర్ (Godfather Teaser Poster)

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మోస్ట్ అవేయిటెడ్‌ మూవీ గాడ్‌ ఫాదర్ (Godfather) నుంచి క్రేజీ సర్ ప్రైజ్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. రేపు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'గాడ్ ఫాదర్' టీజర్ ని విడుదల చేశారు. మెగా ఫ్యాన్స్ అంచనాలను ఈ టీజర్ తో నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు మేకర్స్. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు.  

'ఇరవై ఏళ్లు ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదు.. సడెన్ గా తిరిగొచ్చిన ఆరేళ్లలో జనంలో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు' అంటూ హీరో క్యారెక్టర్ గురించి చెప్పే డైలాగ్ తో టీజర్ (God Father Teaser) మొదలైంది. సత్యదేవ్ రోల్ ని చాలా అగ్రెసివ్ గా చూపించారు. నయనతార (Nayanthara), సల్మాన్ ఖాన్ (Salman Khan) లను కూడా టీజర్ లో చూపించారు. 'వెయిట్ ఫర్ మై కమాండ్ బ్రదర్' అంటూ చిరు చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. యాక్షన్ బ్లాక్స్, చిరంజీవి సిగ్నేచర్ స్టైలింగ్.. ఇవన్నీ టీజర్‌ని వేరే లెవల్‌కి తీసుకెళ్ళాయి. 

పొలిటికల్ నేపథ్యంతోనూ సినిమాలో ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ ఉన్నట్లే కనిపిస్తోంది. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘లూసిఫర్’ రీమేక్ గా ఈ ‘గాడ్ ఫాదర్’ తెరకెక్కతోంది. 'గాడ్‌ ఫాదర్' (Godfather Release date) సినిమాను విజయదశమికే రిలీజ్‌ చేస్తామంటూ గతంలోనే మేకర్స్ కన్ఫర్మ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే మెగా ఫ్యాన్స్ వెయింటింగ్ షూరూ అయిపోయింది.

మెగాస్టార్ సతీమణి  కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వరుస సినిమాలతో వ్యవహరించబోతున్న చిరంజీవి.. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ సినిమా ‘భోళా శంకర్’ (Bhola Shankar), బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. 

Read More: God Father Update: 'గాడ్ ఫాదర్'లో సల్మాన్ ఖాన్, చిరంజీవితో (Chiranjeevi) కలిసి స్టెప్పులేయిస్తున్న ప్రభుదేవా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!