Chiranjeevi: చిరంజీవికి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు

Updated on Nov 20, 2022 09:10 PM IST
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు చిరంజీవికి లభించిందంటూ కేంద్రం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు గోవాలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనురాగ్ సింగ్ ఠాకూర్ ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు మెగాస్టార్ చిరంజీవికి లభించిందటూ ప్రకటించారు.

అభిమానుల వల్లే సాధ్యమైంది - చిరు

చిరంజీవి (Chiranjeevi)దాదాపు 150 సినిమాలకు పైగా నటించారు. హీరోగా, డాన్సర్‌గా, నిర్మాతగా చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలో సక్సెస్ ఫుల్ నటుడిగా కొనసాగుతున్నారు. తనకు ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డును ఇచ్చినందుకు చిరంజీవి కేంద్రానికి థ్యాంక్స్ చెప్పారు. తాను ఇలాంటి స్థాయికి చేరుకోవడానికి తన అభిమానులే కారణమని ట్వీట్ చేశారు. 

Read More: Waltair Veerayya : చిరంజీవి (Chiranjeevi) కొత్త సినిమా వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఎప్పడంటే

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!