మెగాస్టార్‌‌ చిరంజీవి (Chiranjeevi) – బాబీ సినిమా ‘వాల్తేర్‌‌ వీరయ్య’ షూటింగ్‌ కోసం మలేషియాకు వెళ్లనున్న చిత్ర యూనిట్!

Updated on May 25, 2022 07:43 PM IST
డైరెక్టర్‌‌ బాబితో మెగాస్టార్‌‌ చిరంజీవి
డైరెక్టర్‌‌ బాబితో మెగాస్టార్‌‌ చిరంజీవి

‘ఆచార్య’ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్పీడ్ పెంచాడు. వరుసగా సినిమాలు ప్రకటిస్తూ వాటిని పట్టాలెక్కిస్తున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’, మెహెర్ రమేష్‌ డైరెక్షన్‌లో ‘భోళా శంకర్’ చిత్రాలతో పాటు బాబీ దర్శకత్వంలోనూ ఒక సినిమా చేయడానికి చిరు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడు. మెగా154 గా పిలుచుకుంటున్న ఈ సినిమాకి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్‌ను ఖాయం చేస్తున్నట్టు సమాచారం. త్వరలో దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్టు తెలుస్తోంది.

వాల్తేర్ సముద్ర తీరం నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం మత్స్యకారుల నాయకుడిగా చిరంజీవి కనిపించనున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా చేపల్ని  గ్లోబల్‌గా విక్రయించే కొన్ని సీన్స్ ఉంటాయని.. వాటి కోసం విదేశాల్లో కొన్ని సీన్స్ తీయాల్సి ఉన్నందున సినిమా యూనిట్‌ త్వరలో మలేషియా వెళ్లనుందని సమాచారం. 

మలేషియాలో కొన్ని రోజుల షూటింగ్ తర్వాత చిత్ర బృందం హైదరాబాద్ వస్తుంది. అనంతరం హైదరాబాద్‌లో జరిగే షూటింగ్‌ షెడ్యూల్‌లో సినిమాలోని పలు కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నాడు దర్శకుడు బాబి. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. ‘ముఠామేస్త్రి’ సినిమా తర్వాత ఆ రేంజ్‌లో ఉన్న మాస్‌ క్యారెక్టర్‌‌ను చిరంజీవి మరోసారి చేయడం ఇదే ఫస్ట్‌ టైం. దీంతో ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి.  

విక్టరీ వెంకటేష్‌, నాగచైతన్యలతో ‘వెంకీమామ’ సినిమా తీసి బంపర్‌‌ హిట్‌ అందుకున్నాడు దర్శకుడు బాబీ.  ఆ సినిమా తర్వాత బాబీ తీయబోయే సినిమా ఇదే. దీంతో ఈ సినిమాపైనే అందరి దృష్టి ఉంది. ఈ సినిమాలో చిరంజీవి అండర్‌‌కవర్‌‌ కాప్‌గా నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. సీక్రెట్ మిషన్​లో భాగంగా ఆయన మత్స్యకారుడిగా కనిపిస్తాడని, రవితేజ కోసమే చిరు అండర్ కవర్ కాప్‌గా మారుతాడని తెలుస్తోంది. సముద్రతీరంలో వచ్చే సీన్లు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని,  చిరంజీవి (Chiranjeevi) అభిమానులను ఉర్రూతలూగిస్తాయని టాక్.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!