Waltair Veerayya : చిరంజీవి (Chiranjeevi) కొత్త సినిమా వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఎప్పడంటే..

Updated on Nov 20, 2022 09:11 PM IST
Waltair Veerayya : వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్న సందర్భంగా మేకర్స్ చిరంజీవి  (Chiranjeevi) కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
Waltair Veerayya : వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్న సందర్భంగా మేకర్స్ చిరంజీవి  (Chiranjeevi) కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

Waltair Veerayya : టాలీవుడ్ హీరో మెగాస్టార్  చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న వాల్తేరు వీరయ్య నుంచి కొత్త అప్‌డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ నవంబర్ 23 తేదీన సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నారు. బాస్ పార్టీ లిరిక్స్‌తో ఈ పాట సాగనుంది. దర్శకుడు బాబి డైరెక్షన్‌లో వాల్తేరు వీరయ్య తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ కూడా వేగవంతంగా జరగుతోంది. 

వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్న సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చిరంజీవి  (Chiranjeevi) స్టైలిష్ లుక్‌లో ఆ పోస్టర్‌లో కనిపించారు. లుంగీతో చిరు మాస్ స్టెప్పులు వేసిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు.  వాల్తేరు వీరయ్య చిత్రానికి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. చిరుకు దేవిశ్రీ ప్రసాద్ బ్లాక్ బాస్టర్ హిట్ పాటలను అందిస్తారనే అంచనాలు ఉన్నాయి. 

చిరు పోస్టర్ అదుర్స్ - అభిమానులు

వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్‌డేట్ ఇండియాలోనే ట్రెండింగ్‌గా మారింది. చిరంజీవి (Chiranjeevi) పోస్టర్ అదుర్స్ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. 

చిరంజీవికి జోడిగా శృతి హాసన్ నటిస్తున్నారు. అంతేకాకుండా మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు.  ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

Read More: Waltair Veerayya: చిరంజీవి (Chiranjeevi), బాబి కాంబోలో తెర‌కెక్కుతున్న 'వాల్తేరు వీర‌య్య' చిత్రం టాప్ 10 విశేషాలు..

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!