Bhola Shankar : రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన 'భోళాశంక‌ర్' .. చిరంజీవి (Chiranjeevi) ట్వీట్ వైరల్ !

Updated on Aug 11, 2022 01:01 PM IST
Bhola Shankar : చిరంజీవి (Chiranjeevi), కీర్తిసురేష్ 'భోళాశంక‌ర్' సినిమాలో అన్నా, చెల్లెలుగా న‌టిస్తున్నారు.
Bhola Shankar : చిరంజీవి (Chiranjeevi), కీర్తిసురేష్ 'భోళాశంక‌ర్' సినిమాలో అన్నా, చెల్లెలుగా న‌టిస్తున్నారు.

Bhola Shankar : టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) న‌టిస్తున్న 'భోళాశంక‌ర్' సినిమా నుంచి మేక‌ర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. రాఖీ పౌర్ణ‌మి సంద‌ర్భంగా చిరంజీవి శుభాకాంక్ష‌లు తెలిపిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'వేదాళం' త‌మిళ్ సినిమాను తెలుగులో 'భోళా శంక‌ర్‌'గా రీమేక్ చేస్తున్నారు. చెల్లెలు సెంటిమెంట్‌తో' భోళాశంక‌ర్' సినిమాను చిత్రీక‌రిస్తున్నారు.

Bhola Shankar : చిరంజీవి (Chiranjeevi), కీర్తిసురేష్ 'భోళాశంక‌ర్' సినిమాలో అన్నా,చెల్లెలుగా న‌టిస్తున్నారు.

రక్షగా నిలుస్తానంటూ చిరు ట్వీట్

రాఖీ కట్టించుకోవటమే కాదు..  తమకు ఎళ్లవేళలా రక్షగా నిలుస్తామని రాఖీ పౌర్ణ‌మి రోజు 'అన్నదమ్ములు తమ అక్కా చెల్లెళ్ళకు' మాటివ్వాలంటూ చిరంజీవి (Chiranjeevi) ట్వీట్ చేశారు. త‌న‌ సోదర సోదరీమణులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలంటూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ సందేశాన్ని పోస్టు చేశారు.

భోళాశంక‌ర్ విషస్

రాఖీ పౌర్ణమి సంద‌ర్భంగా 'భోళాశంక‌ర్' సినిమా నుంచి మేక‌ర్స్.. చిరంజీవి (Chiranjeevi) వాయిస్ వీడియోను రిలీజ్ చేశారు. 'అక్కా - చెల్లెళ్లంద‌రికీ ర‌క్షాబంధ‌న్ శుభాకాంక్ష‌లు.. ప్రేమ‌తో మీ సోద‌రుడు' అంటూ చిరంజీవి వారికి శుభాకాంక్ష‌లు తెలిపారు.

చిరంజీవి, కీర్తిసురేష్ 'భోళాశంక‌ర్' సినిమాలో అన్నాచెల్లెళ్లుగా న‌టిస్తున్నారు. చిరంజీవికి కీర్తి సురేష్ రాఖీ క‌ట్టే స‌న్నివేశాన్ని మేక‌ర్స్ ఈ రోజు వీడియో రూపంలో రిలీజ్ చేశారు. 

Bhola Shankar : చిరంజీవి (Chiranjeevi), కీర్తిసురేష్ 'భోళాశంక‌ర్' సినిమాలో అన్నా, చెల్లెలుగా న‌టిస్తున్నారు.

'భోళాశంక‌ర్' సినిమాకు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి (Chiranjeevi), త‌మ‌న్నా జంట‌గా న‌టిస్తున్నారు.

ఇటీవలే ర‌జ‌నీకాంత్ న‌టించిన సినిమా 'పెద్ద‌న్న' లో హీరోకి చెల్లెలుగా న‌టించిన‌ కీర్తి సురేష్.. చిరంజీవికి కూడా చెల్లెలిగా న‌టిస్తున్నారు. పెద్ద హీరోలతో న‌టించే అవ‌కాశం వ‌దులుకోనంటున్న కీర్తి సురేష్ వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతున్నారు.

Read More: చిరంజీవి (Chiranjeevi) తో భారీ యాక్ష‌న్ సీన్స్‌.. భోళా శంక‌ర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్ 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!