కూతురు 'సితార' బ‌ర్త్ డే రోజున మ‌హేష్ బాబు (Mahesh Babu) స్పెష‌ల్ ట్వీట్

Updated on Jul 21, 2022 02:01 AM IST
త‌న కూతురు ప్ర‌పంచంలోనే ప్ర‌కాశ‌వంత‌మైన న‌క్ష‌త్రమని..  మ‌హేష్ (Mahesh Babu) ప్ర‌శంసించారు. సితార‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.
త‌న కూతురు ప్ర‌పంచంలోనే ప్ర‌కాశ‌వంత‌మైన న‌క్ష‌త్రమని.. మ‌హేష్ (Mahesh Babu) ప్ర‌శంసించారు. సితార‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  గారాల ప‌ట్టి సితార 10వ పుట్టిన రోజును జ‌రుపుకుంటుంది. కూతురు బ‌ర్త్ డే సంద‌ర్భంగా మ‌హేష్ బాబు ట్వీట్ చేశారు. కూతురు సితార‌ను తండ్రిగా తాను ఎంత ప్రేమిస్తున్నారో తెలిసేలా ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం మ‌హేష్ బాబు ట్వీట్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

త‌న కూతురు ప్ర‌పంచంలోనే ప్ర‌కాశ‌వంత‌మైన న‌క్ష‌త్రమని మ‌హేష్ (Mahesh Babu) ప్ర‌శంసించారు. త‌మ‌కు తెలియ‌కుండానే సితార‌కు అప్పుడే ప‌దేళ్లు వ‌చ్చేశాయ‌న్నారు. సితార‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. సితార‌పై త‌న ప్రేమ ఎప్ప‌టికి నిలిచి ఉంటుందంటూ మ‌హేష్ బాబు త‌న ఫీలింగ్ ట్విటర్‌లో తెలిపారు.

మ‌హేష్ బాబు (Mahesh Babu)  భార్య స‌మ‌త్రా శిరోద్క‌ర్ కూడా సితార‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప‌ద‌వ పుట్టిన రోజు చేసుకుంటున్న సితార‌కు హ్యాపీ బ‌ర్త్‌డే అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. సితార అన్న‌య్య గౌత‌మ్ కూడా తన చిట్టి చెల్లెలికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపాడు.

Read More:  Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఇంటిని మీరెప్పుడైనా చూశారా? నిజంగానే ఇది ఓ అద్భుత నిలయం !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!