మహేష్‌బాబు (MaheshBabu) ఫ్యాన్స్‌కు బర్త్‌డే గిఫ్ట్..థియేటర్లలో సందడి చేయనున్న ‘ఒక్కడు’ సినిమా!

Updated on Jul 21, 2022 06:41 PM IST
ఆగస్టు 9వ తేదీన సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) హీరోగా నటించిన ‘ఒక్కడు’ సినిమా ఎంపిక చేసిన థియేటర్లలో స్పెషల్‌ షోలు!
ఆగస్టు 9వ తేదీన సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) హీరోగా నటించిన ‘ఒక్కడు’ సినిమా ఎంపిక చేసిన థియేటర్లలో స్పెషల్‌ షోలు!

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu).. ఈ పేరు వింటే చాలు ఫ్యాన్స్‌కు పండుగే. కొద్ది రోజుల్లో తమ అభిమాన హీరో పుట్టినరోజు రాబోతోంది. ఆ రోజు మహేష్‌ సినిమాకు సంబంధించి ఏ అప్‌డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రతి సంవత్సరం సూపర్‌‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్‌డేట్‌ను ఇవ్వడం మహేష్‌కు అలవాటు. అదే సెంటిమెంట్‌గా మార్చుకున్నారు కూడా. అయితే తన పుట్టినరోజున కూడా కొత్త సినిమాకు సంబంధించిన చిన్న అప్‌డేట్‌ అయినా రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంటారు మహేష్‌.

అయితే ఈసారి మహేష్‌బాబు బర్త్‌డే రోజున అదిరిపోయే గిఫ్ట్‌ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మహేష్‌.. మురారి సినిమాతో తన స్టామినాను ఇండస్ట్రీకి తెలియజేశారు. ఇక, ఆ తర్వాత గుణశేఖర్‌‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒక్కడు’ సినిమా మహేష్‌బాబు కెరీర్‌‌ను మార్చేసింది. ఒక్కసారిగా మాస్ ఇమేజ్‌ను కట్టబెట్టింది. ఒక్కడు సినిమా మహేష్‌ కెరీర్‌‌ను అమాంతం పైకి ఎత్తడమే కాకుండా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్‌ చేసింది కూడా.

మహేష్‌బాబు (MaheshBabu) ఒక్కడు నిమా పోస్టర్లు

20 సంవత్సరాలు పూర్తి..

2003 సంక్రాంతి పండుగకు కానుకగా రిలీజైన ‘ఒక్కడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులను బద్దలుకొట్టింది. ఆ సినిమాలో మహేష్‌ నటనకు అభిమానులు, సినీ ప్రేమికులు ఫిదా అయ్యారు. ఆ సినిమా రిలీజై దాదాపుగా 20 సంవత్సరాలు గడిచింది. ఇన్ని సంవత్సరాల తర్వాత బుల్లితెరపైన కూడా ఒక్కడు సినిమా ఇప్పటికీ సినీ ప్రేక్షకులను అలరిస్తుంటుంది.

అటువంటి ఒక్కడు సినిమా ప్రింట్‌ను డిజిటలైజ్ చేసినట్టు తెలుస్తోంది. డిజిటలైజ్ చేసిన కాపీని మహేష్‌బాబు పుట్టినరోజున పలు థియేటర్లలో వేయబోతున్నారని సమాచారం. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ న్యూస్ ట్రెండింగ్ అవుతోంది. ఏపీ, తెలంగాణల్లోని ఎంపిక చేసిన సెంటర్లలో ఒక్కడు సినిమా స్పెషల్ షోలు వేయనున్నారు. ఒక్కడు సినిమాలో భూమిక చావ్లా హీరోయిన్‌గా నటించారు.

సుదర్శన్ 35 ఎంఎంతోపాటు పలు థియేటర్లలో ఫ్యాన్స్‌ కోసం స్క్రీనింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 9వ తేదీన మహేష్‌బాబు (MaheshBabu) పుట్టినరోజు సందర్భంగా ఒక్కడు సినిమా షో వేస్తున్నారనే వార్త #MaheshBabu పేరుతో ట్విటర్‌‌లో ట్రెండింగ్ అవుతోంది. ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కు నిజంగా పండుగే మరి

Read More : Mahesh Babu Top Ten Movies: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు టాప్‌ 10 సినిమాలు.. ప్రత్యేకంగా మీకోసం

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!