సూప‌ర్ ఫ్యాన్స్‌కు 'థ్యాంక్యూ' అంటూ మ‌హేష్ బాబు (Mahesh Babu) ట్వీట్ !

Updated on Aug 12, 2022 04:17 PM IST
 ఆగ‌స్టు 9 తేదీ మ‌హేష్ బాబు (Mahesh Babu) పుట్టిన‌రోజు  కావ‌డంతో ఎంతో మంది ప్రిన్స్‌కు విష‌స్ తెలిపారు.
ఆగ‌స్టు 9 తేదీ మ‌హేష్ బాబు (Mahesh Babu) పుట్టిన‌రోజు కావ‌డంతో ఎంతో మంది ప్రిన్స్‌కు విష‌స్ తెలిపారు.

టాలీవుడ్ సూప‌ర్ స్టార్‌ మ‌హేష్ బాబు(Mahesh Babu) పుట్టిన రోజు సంద‌ర్భంగా అభిమానుల‌తో పాటు ప‌లువురు  సినీ ప్ర‌ముఖులు ఆయనకు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు ట్విట్ట‌ర్‌లో థ్యాంక్యూ నోట్ పోస్ట్ చేశారు. త‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌తీ ఒక్క‌రికీ 'థ్యాంక్యూ' అంటూ మ‌హేష్ బాబు ట్వీట్ చేశారు. మ‌హేష్ బాబు పుట్టిన‌రోజు 'ఆగ‌స్టు 9' తేది కావ‌డంతో ఎంతో మంది ప్రిన్స్‌కు విషెస్ తెలిపారు. ప్రస్తుతం మహేష్ బాబు పోస్టు చేసిన నోట్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

బిజినెస్‌మేన్‌గా మ‌హేష్‌!

'స‌ర్కారు వారి పాట' సినిమా త‌ర్వాత మ‌హేష్ బాబు(Mahesh Babu) న‌టించ‌బోయే 'ఎస్ఎస్ఎంబి 28' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని హారికా అండ్‌ హాసిని బ్యానర్ పై రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) వ్యవహరిస్తున్నారు. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. 

మ‌హేష్ బాబు పుట్టిన రోజైన ఆగ‌స్టు 9 తేదీన‌ త్రివిక్ర‌మ్ 'SSMB28' సినిమా నుంచి మేక‌ర్స్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టరులో మ‌హేష్ బాబు బిజినెస్‌మేన్ లుక్‌లో క‌నిపించారు. త్రివిక్ర‌మ్ ఎలాంటి క‌థ‌తో ముందుకొస్తున్నారో.. ఇదే క్రమంలో మ‌హేష్‌ను వెండితెర‌పై ఎలా చూపిస్తారో మనం వేచి చూడాల్సిందే.

ఈ సినిమాలో  మ‌హేష్ బాబు డ‌బుల్ రోల్‌లో న‌టిస్తున్నార‌ట‌.  ఈ సినిమా షూటింగ్ ఆగ‌స్టు నెల‌ నుండి ప్రారంభం కానుంది. 2023 స‌మ్మ‌ర్‌కు ఎస్ఎస్ఎంబి 28 రిలీజ్ కానుంది. మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్‌ల సినిమా అప్‌డేట్ రిలీజ్ కావడంతో, ప్రిన్స్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమా 'స‌ర్కారు వారి పాట‌'కు మించి బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించాల‌ని కోరుకుంటున్నారు. 

Read More: 'హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ మహేష్ బాబు' (Mahesh Babu) .. సోష‌ల్ మీడియాలో ఈ రోజు అంతా 'ప్రిన్స్' మానియా !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!