Mahesh Babu: మ‌హేష్ బాబు ఎమోష‌న‌ల్ ట్వీట్!.. తల్లి ఫోటోను షేర్ చేసి నివాళి అర్పించిన మ‌హేష్

Updated on Sep 29, 2022 11:34 AM IST
త‌ల్లి ఇందిరాదేవి అంత్య‌క్రియ‌ల అనంత‌రం మ‌హేష్ బాబు  (Mahesh Babu)  సోష‌ల్ మీడియాలో త‌న అమ్మ ఫోటోను షేర్ చేసి నివాళి అర్పించారు.
త‌ల్లి ఇందిరాదేవి అంత్య‌క్రియ‌ల అనంత‌రం మ‌హేష్ బాబు (Mahesh Babu) సోష‌ల్ మీడియాలో త‌న అమ్మ ఫోటోను షేర్ చేసి నివాళి అర్పించారు.

టాలీవుడ్ సూప‌ర్ స్టార్  మ‌హేష్ బాబు (Mahesh Babu) త‌ల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో బుధ‌వారం క‌న్నుమూశారు. 70 ఏళ్ల ఇందిరా దేవి కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. హైద‌రాబాద్‌లోని ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఇందిరాదేవీ బుధ‌వారం ఉద‌యం 4 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచారు. బుధ‌వారం మధ్యాహ్నం ఇందిరాదేవి అంత్య‌క్రియ‌లు పూర్తి చేశారు. త‌ల్లి ఇందిరాదేవి అంత్య‌క్రియ‌ల అనంత‌రం మ‌హేష్ బాబు సోష‌ల్ మీడియాలో త‌న అమ్మ ఫోటోను షేర్ చేశారు. 

అమ్మ‌కు ప్రేమ‌తో - మ‌హేష్

మ‌హేష్ బాబు (Mahesh Babu)కు త‌న త‌ల్లి అంటే ఎంతో ప్రేమ‌. తన త‌ల్లి గురించి గుర్తుచేసుకునే సంద‌ర్భం వ‌స్తే, మ‌హేష్ బాబు ఆమెపై ఉన్న ప్రేమ‌ను చాలా ప్రత్యేకంగా వ్య‌క్తం చేస్తుంటారు. సోషల్ మీడియాలో తమ అనుబంధాన్ని తెలిపే పోస్టులు పెడుతుంటారు. త‌న త‌ల్లి త‌న‌కు దేవుడితో స‌మాన‌మ‌ని మ‌హేష్ చెప్తుండేవారు. త‌ల్లి అంత్య‌క్రియ‌లు త‌రువాత మ‌హేష్ బాబు సోష‌ల్ మీడియాలో ఇందిరా దేవి ఫోటోను షేర్ చేశారు. అమ్మ‌కు ప్రేమ‌తో అంటూ ఇందిరా దేవి బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేశారు. 

మ‌హేష్ బాబు త‌న త‌ల్లి ఫోటో షేర్ చేస్తూ అమ్మ‌కు ప్రేమ‌తో నివాళులంటూ హార్ట్ సింబ‌ల్స్ యాడ్ చేశారు. మ‌హేష్ బాబు షేర్ చేసిన ఫోటోను చూసిన అభిమానులు రిప్లైలు పెడుతున్నారు. మ‌హేష్ అన్న బాధ‌ప‌డ‌కు స్ట్రాంగ్‌గా ఉండు అంటూ ధైర్యాన్ని చెబుతున్నారు. తామంతా మ‌హేష్ బాబుకు అండ‌గా ఉంటామంటూ అభిమానులు తెలుపుతున్నారు. 

Read More: నాన‌మ్మ కోసం ఎక్కి ఎక్కి ఏడుస్తోన్న సితార (Sitara Ghattamaneni).. సితార‌ను ఓదార్చిన మ‌హేష్ (Mahesh Babu)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!