నాన‌మ్మ కోసం వెక్కి వెక్కి ఏడ్చిన సితార (Sitara Ghattamaneni).. కూతురిని ఓదార్చిన మ‌హేష్ (Mahesh Babu) !

Updated on Sep 28, 2022 04:13 PM IST
ఒడిలో కూర్చుని ఏడుస్తోన్న సితార‌ను మ‌హేష్ (Mahesh Babu)  ఓదారుస్తున్న తీరు అంద‌రినీ కంట‌త‌డి పెట్టిస్తోంది.
ఒడిలో కూర్చుని ఏడుస్తోన్న సితార‌ను మ‌హేష్ (Mahesh Babu) ఓదారుస్తున్న తీరు అంద‌రినీ కంట‌త‌డి పెట్టిస్తోంది.

టాలీవుడ్ స్టార్ హీరో మ‌హేష్ బాబు (Mahesh Babu)  త‌ల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో క‌న్నుమూశారు. మ‌హేష్ బాబుకు త‌న త‌ల్లి అంటే ఎంతో ప్రేమ‌. తన త‌ల్లి గురించి గుర్తుచేసుకునే సంద‌ర్భం వ‌స్తే, మ‌హేష్ బాబు ఆమెపై ఉన్న ప్రేమ‌ను చాలా ప్రత్యేకంగా వ్య‌క్తం చేస్తుంటారు. సోషల్ మీడియాలో తమ అనుబంధాన్ని తెలిపే పోస్టులు పెడుతుంటారు. 

మ‌హేష్ బాబు త‌న కూతురు సితారను కూడా ప్రాణప్రదంగా చూసుకుంటూ ఉంటారు. అలాగే సితార కూడా ఎప్పుడూ త‌న నాన‌మ్మ ఇందిరా దేవి ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేస్తుంటారు. నాన‌మ్మ మ‌ర‌ణ వార్త‌ సితారను బాగా కలిచివేసింది. ఆమె తన తండ్రి ఒడిలో తలపెట్టుకొని, వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ దృశ్యం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. 

కూతురిని ఓదార్చిన మ‌హేష్

ఓ వైపు త‌ల్లి మ‌ర‌ణంతో మ‌హేష్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. మ‌రోవైపు త‌న కూతురు సితార కూడా ఈ ఘటనతో బాగా డిస్టర్బ్ అయ్యింది. దీంతో తన ఒడిలో కూర్చుని ఏడుస్తోన్న సితార‌ను..  మ‌హేష్ (Mahesh Babu) ఓదార్చిన తీరు అంద‌రినీ కంట‌త‌డి పెట్టిస్తోంది. త‌న త‌ల్లి ఇక లేర‌ని దుఃఖాన్ని దిగ‌మింగుకుంటూ, కూతురు సితారను మ‌హేష్ ఓదార్చడానికి ప్రయత్నించారు. 

ఇందిరా దేవీ అంత్య‌క్రియలు

ఇందిరా దేవి పార్థివ దేహాన్ని ఈ రోజు మధ్యాహ్నం 12.00 గంటల వరకు ప్రముఖుల సందర్శనార్ధం పద్మాలయ స్టూడియోలో ఉంచుతారు. ఆ త‌రువాత జూబ్లీహిల్స్‌‌లోని మహా ప్రస్థానంలో ఆమె అంతిమ సంస్కారాలను నిర్వహించ‌నున్నారు. ఇందిరా దేవిని క‌డ‌సారి చూసేందుకు ప‌లువురు సినీ ప్ర‌ముఖులతో పాటు.. సూపర్ స్టార్ కృష్ణ, మ‌హేష్ బాబు అభిమానులు త‌ర‌లివ‌స్తున్నారు.

Read More: మ‌హేష్‌బాబు (Mahesh Babu) త‌ల్లి ఇందిరాదేవి క‌న్నుమూత‌.. విషాదంలో మ‌హేష్ కుటుంబం

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!