Vikram (విక్రమ్): బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టిన ఈ కమల్ హాసన్ చిత్రం గురించి .. ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలివే
విశ్వ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 'విక్రమ్' సినిమాతో కమల్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. కమల్ సొంత బ్యానర్ 'రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్'పై ఈ సినిమాను తెరకెక్కించారు.
కమల్ అభిమాని, తమిళ యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ విక్రమ్ చిత్రానికి దర్శకత్వం వహించారు.
'విక్రమ్' సినిమా కోసం కమల్ ఎన్నో కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. విక్రమ్ సినిమా సక్సెస్ సాధిస్తుందని... తన అంచనాలు ప్రకారం రూ. 300 కోట్లు వసూళ్లు చేస్తుందని కమల్ చెప్పినట్లే జరిగింది. 'విక్రమ్' చిత్రానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు పింక్ విల్లా ఫాలోవర్స్ కోసం..
1. ఒక స్కీన్‌లో నలుగురు హీరోలు
విక్రమ్ సినిమాలో కమల్ హాసన్‌తో పాటు సూర్య, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటించారు. ఈ నలుగురితో దర్శకుడు లోకేష్ కనగరాజ్ అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించారు. రోలెక్స్ సర్‌గా 'సూర్య' క్యారెక్టర్ తెరపై కొన్ని నిమిషాలే కనిపిస్తుంది. కానీ సూర్య రోలెక్స్ సర్ పేరుతో మరింత పాపులర్ అయ్యారు.
2. ప్రీ రిలీజ్ కలెక్షన్
కమల్ హాసన్ సినిమా 'విక్రమ్' ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.200 కోట్ల పై మాటే. కమల్ నటించిన సినిమాలేవీ ఇన్ని వందల కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ వసూళ్లను సాధించలేదు.
3. రెమ్యూనరేషన్ తీసుకోని సూర్య
విక్రమ్ సినిమాలో నటించినందుకు హీరో సూర్య పారితోషికం తీసుకోలేదట. సూర్య పాత్ర ఐదు నిమిషాలు పాటు వెండితెరపై కనిపించింది. కమల్ హాసన్ లాంటి విశ్వ నటుడితో కలిసి సినిమా చేయడం తన డ్రీమ్ అని సూర్య తెలిపారు. 'విక్రమ్' సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు లోకేష్‌కు కృతజ్ఞతలు చెప్పారు.
4. విక్రమ్ కలెక్షన్ల మోత
విశ్వనటుడు కమల్ హాసన్ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత నటించిన యాక్షన్ మూవీ విక్రమ్ (Vikram). లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. విక్రమ్ సినిమా కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లో వంద కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.
ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే నార్త్‌లో విక్రమ్ సినిమా అనుకున్నంత బిజినెస్ చేయలేదు. హిందీ వెర్షన్ నిదానంగా పికప్ అవుతోందని టాక్.
5. మూడేళ్ల తర్వాత తమిళ ఇండస్ట్రీకి హిట్
తమిళ చిత్ర పరిశ్రమలో ఈ మధ్య సక్సెస్ సాధించిన సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. అందులోనూ కలెక్షన్ల పరంగా చూస్తే మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. 2019లో అజిత్ నటించిన 'విశ్వాసం' భారీ కలెక్షన్లు రాబట్టింది.
ఆ తర్వాత వచ్చిన సినిమాలు అంత పెద్ద మొత్తంలో కలెక్షన్లు వసూళ్లు చేయలేకపోయాయి. ఇలాంటి సమయంలో, దాదాపు మూడేళ్ల తర్వాత విక్రమ్ (Vikram) బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కమల్ హాసన్ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
6. లోకేష్‌కు సర్‌ప్రైజ్ గిప్ట్ ఇచ్చిన కమల్
భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు కమల్ హాసన్ (Kamal Haasan) ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు. ఓ లగ్జరీ కారును లోకేష్‌కు కానుకగా ఇచ్చారు. కోటి రూపాయల విలువగల లెక్సస్ సెడాన్ కారును ఇచ్చి కమల్ తన అభిమానాన్ని చూపించారు. కమల్ ఇచ్చిన కానుకతో లోకేష్ ఫుల్ ఖుషీ అయ్యాడు. కారు పక్కన కమల్, లోకేష్‌లు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనకు ఆశ్చర్యకరమైన గిఫ్ట్ వచ్చిందంటూ పోస్ట్ చేశారు.
7. రోలెక్స్‌కు రోలెక్స్ వాచ్
విక్రమ్ (Vikram) సినిమాలో నటించిన సూర్య ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదు. 'విక్రమ్' సక్సెస్ సాధించడంతో కమల్ హాసన్ సూర్య కోసం ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. సూర్య ఇంటికి వెళ్లి మరీ ఆ బహుమతి ఇచ్చారు. టాప్ వాచ్ బ్రాండ్ రోలెక్స్‌కు చెందిన ఖరీదైన చేతి గడియారాన్ని సూర్యకు కానుకగా ఇచ్చారు కమల్.
అంతేకాదు కమల్ తన చేత్తో సూర్యకు ఆ వాచ్ తొడిగారు. కమల్ హాసన్‌తో పాటు 'విక్రమ్' దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా సూర్య ఇంటికి వెళ్లారు. సూర్య తండ్రి, నటుడు శివకుమార్ విక్రమ్ టీంను ప్రశంసించారు. కమల్‌తో తనకు ఉన్న అనుబంధం గుర్తుచేసుకున్నారు. కమల్‌ను చూడగానే శివకుమార్ ఆప్యాయంగా హత్తుకున్నారు.
8. కమల్‌కు మేకప్ వేసిన దర్శకుడు
'విక్రమ్' సినిమా కోసం దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేకప్ మ్యాన్ అవతారం ఎత్తారు. 'విక్రమ్' షూటింగ్‌లో కమల్ హాసన్‌కు దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్వయంగా మేకప్ వేశారట. 32 రోజుల పాటు జరిగిన కమల్ షెడ్యూల్‌లో మేకప్ మ్యాన్‌గా లోకేష్.. హీరోకు డిఫెరెంట్ లుక్ తీసుకొచ్చారట.
9. విక్రమ్ వసూళ్లు
విక్రమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 16 రోజుల్లో.. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు రాబట్టింది. ఈ మొత్తం కలెక్షన్స్‌లో సగం రూ.150 కోట్లు కేవలం తమిళనాడు నుంచే వచ్చాయని ఇండస్ట్రీ టాక్. తమిళనాడులో బాహుబలి - 2 రికార్డును విక్రమ్ బద్దలు కొట్టింది.
10. విక్రమ్ టీమ్‌తో కలిసి భోజనం చేసిన కమల్
కమల్ హాసన్ విక్రమ్ సక్సెస్ పార్టీని ఓ రేంజ్‌లో అరేంజ్ చేశారు. విక్రమ్ సినిమా కోసం వర్క్ చేసిన ప్రతీ ఒక్కరిని పిలిచి ప్రత్యేక వంటకాలతో భోజనాలను ఏర్పాటు చేశారు. లైట్ బాయ్, ప్రొడక్షన్, మేకప్.. ఇలా సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి గ్రాండ్ పార్టీ ఇచ్చారు.ఈ పార్టీకి కమల్ హాసన్‌తో పాటు లోకేష్ కనకరాజ్, అనిరుధ్ రవిచందర్, విజయ్ సేతుపతి, ఉదయనిధి స్టాలిన్, పలువురు తమిళ ప్రముఖులు హాజరయ్యారు.
Read More: రోలెక్స్‌గా నటించినందుకు సూర్యకు సప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్ (Kamal Haasan)