'రాను రానంటూనే సిన్నదో' అంటున్న‌ మహేష్ బాబు!.. మ‌హేష్‌కి భ‌లే సెట్ అయింద‌న్న నితిన్ (Nithiin)

Updated on Jul 14, 2022 02:11 PM IST
త‌న పాట‌కు మ‌హేష్ బాబు స్టెప్పులు సూప‌ర్‌గా సింక్ అయ్యాయంటూ నితిన్ (Nithiin) ట్విట్ట‌ర్‌లో పోస్ట్ పెట్టారు. 
త‌న పాట‌కు మ‌హేష్ బాబు స్టెప్పులు సూప‌ర్‌గా సింక్ అయ్యాయంటూ నితిన్ (Nithiin) ట్విట్ట‌ర్‌లో పోస్ట్ పెట్టారు. 

టాలీవుడ్‌లో హీరో నితిన్ (Nithiin) న‌టించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. రీసెంట్‌గా ఈ చిత్రం నుంచి 'రా..రా.. రెడ్డి' సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఆ పాట చివ‌రిలో నితిన్ హిట్ సాంగ్స్‌లో ఒక‌టైన 'రాను రానంటూనే సిన్న‌దో ' పాట‌ను యాడ్ చేశారు. ఆ పాట‌కు మ‌హేష్ స్టెప్పుల‌ను జోడించారు నితిన్ అభిమానులు. మహేష్ బాబు త‌న సాంగ్‌కు స్టెప్పులేయ‌డంపై నితిన్ ఏమ‌న్నారంటే..

మ‌హేష్ డాన్స్ సింక్ అయింది - నితిన్
మ‌హేష్ బాబు (Mahesh Babu) 'స‌ర్కారు వారి పాట' సినిమాలో 'మ‌..మ‌. మ‌హేశా ' సాంగ్‌కు మాస్ స్టెప్పులు వేశారు. మ‌హేష్, కీర్తి సురేష్ ఓ రేంజ్‌లో డాన్సులు వేశారు. వీరి స్టెప్పుల‌ను 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' లోని 'రా.రా.రెడ్డి ' సాంగ్‌కు మ్యాచ్ చేసి కొంద‌రు నితిన్ అభిమానులు ఎడిట్ చేశారు.

నితిన్ పాట‌కు మ‌హేష్ డాన్సు భ‌లే బాగుందంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియో చూసిన నితిన్ సంతోషంలో మునిగిపోయారు. త‌న పాట‌కు మ‌హేష్ బాబు స్టెప్పులు సూప‌ర్‌గా సింక్ అయ్యాయంటూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ పెట్టారు. 

'మాచ‌ర్ల‌ని యోజ‌క‌వ‌ర్గం' లో 'రా.రా. రెడ్డి ' పాటలో నితిన్  (Nithiin), అంజ‌లి న‌టించారు. అంజ‌లి చేసిన ఈ స్పెష‌ల్ సాంగ్  ఓ రేంజ్‌లో దూసుకెళుతోంది. కాసర్ల శ్యామ్ 'రా..రా..రెడ్డి ' పాట‌కు లిరిక్స్ రాశారు. మహతి స్వరసాగర్ సంగీతం స‌మ‌కూర్చారు. రిలీజ్ చేసిన 24 గంట‌ల్లో 'రా..రా.. రెడ్డి' మిలియ‌న్ వ్యూస్‌ను రాబ‌ట్టింది. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన పోస్ట‌ర్‌లు, గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి.  

ఎడిట‌ర్ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' ఆగ‌స్టు 12న రిలీజ్ కానుంది. గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్ పాత్ర‌లో ఈ సినిమాలో నితిన్  (Nithiin) క‌నిపించ‌నున్నారు.  ఈ చిత్రంలో కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఆదిత్య మూవీస్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Read More: Nithiin : నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలోని "రారా రెడ్డి" సాంగ్‌ అదుర్స్.. ఈ గీతం ప్రత్యేకత ఏంటో తెలుసా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!