నితిన్ (Nithiin)‘మాచర్ల నియోజకవర్గం’లో స్పెషల్‌ సాంగ్‌ చేయనున్న ‘బ్లాక్‌బస్టర్‌‌’ ఐటమ్‌ భామ అంజలి

Updated on Jul 04, 2022 02:37 PM IST
నితిన్ హీరోగా చేసిన మాచర్ల నియోజకవర్గం సినిమా పోస్టర్, అంజలి
నితిన్ హీరోగా చేసిన మాచర్ల నియోజకవర్గం సినిమా పోస్టర్, అంజలి

జయం సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టారు నితిన్ (Nithiin). తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్‌‌ హిట్‌ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన ‘దిల్‌’ సినిమా కూడా సూపర్‌‌ డూపర్‌‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకోవడంతో, నితిన్ స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే నితిన్ మూడో సినిమాగా వచ్చిన ‘సంబరం‘ మాత్రం కొద్దిగా నిరాశపరిచింది. అయినప్పటికీ, ఆ సినిమాలో నితిన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఇక, ‘ఫోటో‘ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు హీరోయిన్ అంజలి. తర్వాత‘ ప్రేమలేఖ‘ రాశా సినిమా చేసినా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అనంతరం తమిళం, కన్నడలో పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు అంజలి. చాలా కాలం తర్వాత తెలుగులో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ అచ్చ తెలుగింటి భామ.

మాచర్ల నియోజకవర్గం సినిమా పోస్టర్

సరైనోడు తర్వాత..

ఆ సినిమా తెచ్చిన క్రేజ్‌తో, స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది అంజలి. అదే జోరులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ‘సరైనోడు’ సినిమాలో  కూడా స్పెషల్‌ సాంగ్‌ చేసే చాన్స్ కొట్టేసింది.

ఇప్పుడు మరో సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నర్తించే అవకాశాన్ని పట్టేసింది అంజలి. అయితే ఈసారి యంగ్ హీరో నితిన్ కొత్త సినిమాలో, ఈమె డ్యాన్స్ చేయడానికి రెడీ అయ్యారని చిత్ర యూనిట్ ప్రకటించింది.

స్పెషల్ సాంగ్ పోస్టర్ రిలీజ్

నితిన్ (Nithiin) హీరోగా తెరకెక్కుతున్న 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలో అంజలి ఒక స్పెషల్ సాంగ్ చేయనుంది. దానికి సంబంధించిన పోస్టర్‌‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్. ఆ పాటకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే రివీల్‌ చేయనున్నట్టు కూడా వెల్లడించారు.

పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కుతున్న 'మాచర్ల నియోజకవర్గం' సినిమాకు ఎంఎస్ రాజశేఖర్‌‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 12వ తేదీన సినిమా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది.

Read More : ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ (Tollywood) సెలబ్రిటీలు

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!