Ponniyin Selvan 1: 'పొన్నియిన్ సెల్వ‌న్' టీజ‌ర్ రిలీజ్ చేయ‌డం థ్రిల్లింగ్ అనిపించింది - మ‌హేష్ (Mahesh Babu)

Updated on Jul 09, 2022 04:02 PM IST
Ponniyin Selvan 1: పొన్నియిన్ సెల్వ‌న్ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాన‌ని మ‌హేష్ బాబు (Mahesh Babu) తెలిపారు.
Ponniyin Selvan 1: పొన్నియిన్ సెల్వ‌న్ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాన‌ని మ‌హేష్ బాబు (Mahesh Babu) తెలిపారు.

Ponniyin Selvan 1: ద‌ర్శ‌కుడు మ‌ణి ర‌త్నం సినిమా కోసం టాలీవుడ్ న‌టుడు రంగంలోకి దిగారు. పొన్నియిన్ సెల్వ‌న్  తెలుగు టీజ‌ర్‌ను సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu)  రిలీజ్ చేశారు. పొన్నియిన్ సెల్వ‌న్ టీజ‌ర్ లాంచ్ చేయ‌డం థ్రిల్లింగ్‌గా ఉంద‌ని మ‌హేష్ తెలిపారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ‌మాన్ అద్భుత‌మైన మ్యూజిక్ అందించారు. 

తెలుగు టీజ‌ర్ విడుద‌ల‌
మ‌హేష్ బాబుతో పొన్నియిన్ సెల్వ‌న్ 1 (Ponniyin Selvan 1) తెలుగు వ‌ర్ష‌న్ టీజ‌ర్‌ను రిలీజ్ చేయించారు. ట్విట్ట‌ర్‌లో మ‌హేష్ ఈ చిత్ర టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. త‌న‌కు ఇష్ట‌మైన డైరెక్ట‌ర్ల‌లో మ‌ణిర‌త్నం ఒక‌ర‌ని మ‌హేష్ తెలిపారు. ఈ చిత్ర టీజ‌ర్ రిలీజ్ చేయ‌డం థ్రిలింగ్‌గా ఉంద‌న్నారు. సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాన‌ని మ‌హేష్ బాబు (Mahesh Babu) తెలిపారు. త‌మిళ్ టీజ‌ర్‌ను సూర్య‌, క‌న్న‌డ‌లో ర‌క్షిత్ శెట్టి రిలీజ్ చేశారు. హిందీ వ‌ర్ష‌న్ టీజ‌ర్‌ను బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ లాంచ్ చేశారు. ఇక మ‌ళ‌యాళం టీజ‌ర్‌ను న‌టుడు మోహ‌న్‌లాలా రిలీజ్ చేశారు. 

చోళ రాజుల‌కు సంబంధించిన క‌థ ఆధారంగా పొన్నియిన్ సెల్వ‌న్ తెర‌కెక్కుతుంది. ఓ న‌వ‌ల ఆధారంగా ఈ సినిమాను చిత్రీక‌రిస్తున్నారు. విక్రమ్, కార్తి, ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్, త్రిష‌, జ‌యం ర‌విలు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. 

ద‌ర్శ‌క నిర్మాత‌గా మ‌ణిర‌త్నం
Ponniyin Selvan 1: పొన్నియిన్ సెల్వ‌న్ -1లో చోళ రాజుగా హీరో విక్ర‌మ్ న‌టిస్తున్నారు. 'పొన్నియిన్ సెల్వ‌న్ ' చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల కానుంది. విడుద‌ల‌కు రెండు నెలల ముందు నుంచే మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ల జోరు పెంచారు. ఈ సినిమా టీజ‌ర్ జూలై 7న తంజావూరులోని బృహ‌దేశ్వ‌రా టెంపుల్‌లో విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌, మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై మ‌ణిర‌త్నం స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Read More: Ponniyin Selvan: 'రాణి నందిని దేవి'గా మాజీ ప్రపంచ సుందరి .. పవర్‌ఫుల్ పాత్రలో ఐశ్వ‌ర్య‌రాయ్ (Aishwarya Rai)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!