మ‌హేష్ బాబు (Mahesh Babu) 'ఎస్ఎస్ఎంబి 29'ను రాజ‌మౌళి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలుసా!

Updated on Aug 19, 2022 08:10 PM IST
'ఎస్ఎస్ఎంబి 29' చిత్రంతో మ‌హేష్ బాబు  (Mahesh Babu) మొద‌టి సారి పాన్ ఇండియా సినిమాలో న‌టించ‌నున్నారు.
'ఎస్ఎస్ఎంబి 29' చిత్రంతో మ‌హేష్ బాబు (Mahesh Babu) మొద‌టి సారి పాన్ ఇండియా సినిమాలో న‌టించ‌నున్నారు.

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu), ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి సినిమాపై ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి పెరిగింది. వీరిద్ద‌రి కాంబోలో రానున్న 'ఎస్ఎస్ఎంబి 29' సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌హేష్ బాబు కోసం స్పెష‌ల్ స్టోరిని రాజ‌మౌళి సిద్ధం చేశారు. మ‌హేష్, రాజ‌మౌళి సినిమా 'బాహుబలి' సినిమా రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉందని సినీ క్రిటిక్స్ అంటున్నారు.

మ‌హేష్, రాజ‌మౌళి కాంబో అదుర్స్

'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో రాజ‌మౌళి తెలుగు సినిమాను హాలీవుడ్ రేంజ్‌కు పెంచారు. ఇక మ‌హేష్ బాబు (Mahesh Babu) కు వ‌ర‌ల్డ్ లెవ‌ల్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మ‌హేష్ త‌న 29 వ సినిమాను రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చేయనున్నారు. ఈ సినిమాను 'ఎస్ఎస్ఎంబి 29' అనే టెంప‌ర‌రీ పేరుతో తెర‌కెక్కించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన  స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోందని స‌మాచారం. ఈ సినిమా వ‌చ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చనున్నారు.

నా క‌ల నిజ‌మైంది : మ‌హేష్

రాజ‌మౌళితో సినిమా చేయ‌డంపై మ‌హేష్ బాబు (Mahesh Babu) స్పందించారు. రాజ‌మౌళితో సినిమా చేయ‌డం త‌న క‌ల అన్నారు. ద‌ర్శ‌క ధీరుడితో ఒక్క సినిమా త‌న‌కు 25 సినిమాల‌తో స‌మానం అన్నారు. రాజ‌మౌళితో సినిమా చేయ‌డం కోసం శారీర‌కంగా క‌ష్ట‌ప‌డాల్సి ఉంద‌న్నారు. 'ఎస్ఎస్ఎంబి 29' చిత్రంతో మ‌హేష్ బాబు మొద‌టి సారి పాన్ ఇండియా సినిమాలో న‌టించ‌నున్నారు. ఆఫ్రిక‌న్ ఫారెస్ట్ అడ్వెంచర్ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. 

Read More: ద‌ర్శ‌క ధీరుడికి హాలీవుడ్ ద‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు.. రూసో బ్రదర్స్‌ను క‌లుస్తాన‌న్న‌ రాజ‌మౌళి (SS Rajamouli)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!