ద‌ర్శ‌క ధీరుడికి హాలీవుడ్ ద‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు.. రూసో బ్రదర్స్‌ను క‌లుస్తాన‌న్న‌ రాజ‌మౌళి (SS Rajamouli)

Updated on Jul 30, 2022 06:28 PM IST
 ‘ది గ్రే మాన్’ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రూసో బ్ర‌ద‌ర్స్, రాజ‌మౌళి (S.S. Rajamouli) నెట్‌ప్లిక్స్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.
‘ది గ్రే మాన్’ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రూసో బ్ర‌ద‌ర్స్, రాజ‌మౌళి (S.S. Rajamouli) నెట్‌ప్లిక్స్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

'బాహుబ‌లి' సినిమాతో టాలీవుడ్  ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి (SS Rajamouli) ద‌ర్శ‌క ధీరుడిగా ఇండియా లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్‌గా విడుద‌లై.. బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్ర‌పంచ సినీ వ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. హాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌క, నిర్మాత‌లు రాజ‌మౌళిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. రాజ‌మౌళి డైరెక్ష‌న్‌పై హాలీవుడ్ స్టార్‌లు ఎఏమ‌న్నారో తెలుసా!

రాజ‌మౌళిని క‌ల‌వ‌డం ఆనందంగా ఉంది - హాలీవుడ్ ద‌ర్శ‌కులు

త‌మిళ న‌టుడు ధ‌నుష్ 'ది గ్రే మ్యాన్' అనే హాలీవుడ్ మూవీలో న‌టించారు. ఈ సినిమాను ప్ర‌ముఖ హాలీవుడ్ ద‌ర్శ‌కులు రూసో బ్ర‌ద‌ర్స్ తెర‌కెక్కించారు. ‘ది గ్రే మాన్’ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రూసో బ్ర‌ద‌ర్స్, రాజ‌మౌళి నెట్‌ప్లిక్స్ నిర్వ‌హించిన‌ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రాజ‌మౌళి (SS Rajamouli)తో కాసేపు సినిమాలపై ముచ్చ‌టించారు. రాజ‌మౌళిని షోలో క‌లుసుకోవ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని రూసో బ్ర‌ద‌ర్స్  సోష‌ల్ మీడియాలో తెలిపారు. 

రాజ‌మౌళి హాలీవుడ్ ద‌ర్శ‌కుల‌కు త‌న స్టైల్లో రిప్లై ఇచ్చారు. రూసో బ్ర‌ద‌ర్స్‌తో క‌లిసి ప్రోగ్రామ్‌లో పాల్గొన‌డం ఎంతో గౌర‌వంగానూ, సంతోషంగానూ ఉంద‌న్నారు. భ‌విష్య‌త్తులో రూసో బ్రదర్స్ ద‌గ్గ‌ర సినిమాకు సంబంధించిన అంశాల‌ను నేర్చుకోవాల‌ని ఉంద‌ని రాజ‌మౌళి తెలిపారు.  
 

హాలీవుడ్ అవార్డు పొందిన ఆర్ఆర్ఆర్ (RRR)

రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ న‌టించిన 'ఆర్ఆర్ఆర్' ప‌లు రికార్డులను సొంతం చేసుకుంది. ప్ర‌పంచ స్థాయిలో 'ఆర్ఆర్ఆర్' సినిమాకు గుర్తింపు ల‌భిస్తోంది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్టుల‌లో ఉత్తమ చిత్రం కేటగిరీలో ఆర్ఆర్ఆర్ (RRR) రెండో స్థానంలో నిలిచింది. 

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్టుకు, ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఇండియ‌న్ సినిమా కూడా పోటీ ప‌డ‌లేదు. 'ఆర్ఆర్ఆర్' ఉత్త‌మ చిత్ర విభాగంలో మ‌రో 9 హాలీవుడ్ చిత్రాల‌తో పోటీప‌డడం గమనార్హం. ఉత్త‌మ చిత్రంగా తమ సినిమానే ఈ పోటీలో విజ‌యం సాధిస్తుంద‌ని 'ఆర్ఆర్ఆర్' చిత్ర యూనిట్ బలంగా నమ్మింది. అయినప్పటికీ, రెండో స్థానంలో నిలిచి ఆర్.ఆర్.ఆర్ తెలుగు సినిమా స‌త్తాను ప్ర‌పంచానికి తెలిసేలా చేసింది. 

'ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాదాపు రూ.12 వంద‌ల‌ కోట్లను కొల్ల గొట్టి ఇండియ‌న్ సినిమా రికార్డుల‌ను తిర‌గ రాసింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, శ్రియా శరన్, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటించారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాత డీవీవీ దానయ్య ఆర్‌.ఆర్.ఆర్ చిత్రాన్ని నిర్మించారు. ఎంఎం కీరవాణీ సంగీతం అందించారు.  

Read More: RRR: 'భీమా నిన్ను క‌న్న నేల త‌ల్లి గ‌ర్వ‌ప‌డుతుంది'... ఇజ్రాయెల్ ప‌త్రిక‌ల్లో ఎన్టీఆర్( NTR) క‌థ‌నాలు

 

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!