Pakka Commercial: పక్కా కమర్షియల్ ట్రైల‌ర్ .. గోపీచంద్‌ను (Gopichand) తెర‌పైన చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..!

Updated on Jun 29, 2022 07:09 PM IST
 గోపిచంద్ (Gopichand) న‌టించిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. 
గోపిచంద్ (Gopichand) న‌టించిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. 

మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) న‌టించిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ఈ  సినిమాలో లాయర్‌గా ఓ కొత్త గెటప్‌లో ప్రేక్షకులను ఎంట‌ర్‌టైన్ చేసేందుకు గోపిచంద్ రెడీ అయ్యారు. ఈ సినిమాకు మారుతీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఈ రోజే ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. 

గోపిచంద్ (Gopichand)కు జోడిగా ఈ చిత్రంలో హీరోయిన్ రాశీ ఖన్నా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ 'పక్కా కమర్షియల్' మైండ్ సెట్ ఉన్న లాయ‌ర్ పాత్ర‌లో కనిపంచనున్నారు. స‌త్య‌రాజ్ గోపిచంద్ తండ్రి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతాన్ని అందించారు. 

'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' సినిమా ఇప్ప‌టికే సెన్సార్ కంప్లీట్ చేసుకొని విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ద‌ర్శ‌కుడు మారుతీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్‌తో పాటు తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా సంయుక్తంగా దక్కించుకున్నాయి. సినిమా విడుద‌లైన ఐదు వారాల‌కు 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. 

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే
'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' సినిమా విడుద‌ల‌కు ముందే వ‌సూళ్ల ప‌రంగా దూసుకెళుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 19.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాపీస్ దగ్గర రూ. 20 కోట్లు వ‌సూళ్లు చేయాల్సి ఉంది.

లేటుగా రిలీజ్ చేస్తున్న చిత్ర యూనిట్
ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే క‌రోనా కార‌ణంగా, పాన్ ఇండియా సినిమాల వ‌ల్ల లేట్‌గా రిలీజ్ చేస్తున్నారు. గోపిచంద్ (Gopichand) న‌టించిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా జూలై 1న ప్రేక్ష‌కుల మందుకు రానుంది.

Read More: Gopichand: గోపిచంద్ 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' ప‌క్కా హిట్ సాధిస్తుంద‌న్న‌ చిత్ర యూనిట్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!